Sunday, July 25, 2021
spot_img

వీటితో అందమైన చర్మం మీ సొంతం..

అందంగా కనిపించాలని ఎవరికీ ఉండదు.. అందుకు ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు.. కానీ ఇంట్లో వున్న వాటిని మాత్రం అస్సలు పట్టించుకోరు.. వంటలను చేసుకొనే బంగాళాదుంపలను అందం మెరుగుపరచడానికి కూడా ఉపయొగిస్తారు.. బంగాళాదుంపను ఉపయోగించడం ద్వారా మీ నలుపు రంగు ముఖాన్ని చాలా వరకు క్లియర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

మచ్చలు తొలగించడానికి :

ముఖంపై ఉన్న మచ్చలను తొలగించడానికి బంగాళాదుంప, పసుపు ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించండి. దీని కోసం సగం బంగాళాదుంపను తరుముకోవాలి దానికి ఒక చిటికెడు పసుపు వేసి మెడ నుంచి ముఖానికి అప్లై చేసి అరగంట పాటు ఆరనివ్వాలి. తరువాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేయండి. ఈ ప్యాక్ రోజువారీ వాడకంతో ముఖం రంగు కూడా స్పష్టంగా తెలుస్తుంది.

మీ ముఖం మీద ముడతలు, నలుపు రంగుతో బాధపడుతుంటే ఉడికించిన బంగాళాదుంప ఫేస్ ప్యాక్ మీకు చాలా ఉపయోగపడుతుంది. దీని కోసం ఉడికించిన బంగాళాదుంపను పేస్ట్‌లా చేసి, ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ క్రీమ్ కలపాలి. తరువాత ఈ ఫేస్ ప్యాక్ ను ముఖం మీద సుమారు 15 నిమిషాలు అప్లై చేయాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి..

కళ్ల కింద నల్లటి వలయాలు :

కళ్ల కింద నల్లటి వలయాలు ఉంటే చూడటానికి అసహ్యంగా ఉంటుంది. ముడి బంగాళాదుంప ముక్కలను మీ కళ్ళపై ఉంచండి. ఇది కాకుండా మీరు కళ్ళ చుట్టూ బంగాళాదుంప రసాన్ని వర్తింపజేయాలి. దీంతో నల్లటి వలయాలు కనిపించవు. అంతేకాదు కళ్ళ చుట్టూ ఉండే వాపు కూడా తగ్గుతుంది..

మొటిమల కోసం:

మీ ముఖం మీద మొటిమల సమస్య ఉంటే మీరు ఉడికించిన బంగాళాదుంపలను బాగా రుబ్బుకోవాలి. దానిని ఫేస్ ప్యాక్ లాగా ముఖం మీద అప్లై చేయాలి. దీంతో ముఖం రంధ్రాలపై పేరుకుపోయిన ధూళి కూడా బయటకు వస్తుంది. వారానికి రెండుసార్లు ప్రయత్నించవచ్చు. చాలా మంచి ఫలితాలను పొందుతారు..

చూసారుగా బంగాళాదుంపను ఉపయోగించి అందాన్ని ఇలా మరింత పెంచుకొవచ్చు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles