Sunday, July 25, 2021
spot_img

బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కోరలు చాచితున్న సంగతి తెలిసిందే.. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. పదుల సంఖ్యలో రికవరీ అవుతున్నారు..ఈ క్రమంలో.. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయా ? లేదా అనే సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో లాక్ డౌన్, ఏపీలో మధ్యాహ్న కర్ఫ్యూ, కఠిన నిబంధనలు అమలవుతున్నాయి.

ఈ సందర్భంలో సీఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.ఏపీలో 03, తెలంగాణలో 06 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.తెలంగాణలో జూన్ 03వ తేదీతో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. అలాగే ఏపీ రాష్ట్రంలో మే 31వ తేదీతో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది.ఎన్నికలు నిర్వహిస్తే..ప్రమాదకర పరిస్థితులు నెలకొంటాయని సీఈసీ భావించింది.

అంతేగాకుండా..ఇటీవలే జరిగిన ఎన్నికల నిర్వహణ తీరుపై సుప్రీంకోర్టు ఆక్షేపించిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికలు నిర్వహణ బాగుండదని, ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాతే ఎన్నికలను నిర్వహించే దిశగా అధికారులు ఆలోచిస్తున్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles