Sunday, July 25, 2021
spot_img

కాకర వల్ల ఆరోగ్యానికి ఎంత మేలో?

ఏదైనా రుచి బాగలేదు అంటే వాటిలో పొషకాలు బోలెడు ఉంటాయని అర్థం..అందులో కాకర కూడా ఒకటి.. కాకర రుచికి చేదు.. కానీ వీటిలొ పొషకాలు మాత్రం మెండుగా వుంటాయి..కాకర కాయ కాలంతో సంబంధం లేకుండా కాస్తూనే వుంటుంది. పల్లెట్లూర్లలో ప్రతి ఇంటిలోనూ దర్శనం ఇస్తూనే వుంటుంది. కాకరలో ఆరోగ్యానికి మేలు చేసే ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సీ ఉంటాయి. 

కాకరకాయ శరీరంలోని వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. వీటిని ఉడికించిన నీళ్లు తాగితే ఇన్ఫెక్షన్ల్లు దరిచేరవు. బీపీని కంట్రోల్‌లో ఉంచేందుకు కాకర ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి హాని చేసే కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె జబ్బులతో పాటు క్యాన్సర్, మలబద్ధకం, లివర్, మూత్రపిండాల సమస్యలకు కూడా కాకర మంచి ఆహారం.
మధుమేహగ్రస్తులు కాకరకాయను తమ ఆహారంలో చేర్చుకుంటే ఇన్సులిన్ స్థాయిల్లో తేడా రాకుండా నియంత్రణలో ఉంచుతూ రక్తంలోని చెక్కర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

ఇకపోతే కాలిన గాయాలను, పుండ్ల ను మాన్పడంలో కాకరకాయలోని గుణాలు బాగా పని చేస్తాయి. రక్తాన్ని శుధ్ధి పరిచి గుండె కు రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది.. ఇంకా చాలా రోగాలకు ఈ కాకరకాయలు మంచి మెడిసిన్ అని చెప్పాలి…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles