Wednesday, July 21, 2021
spot_img

తెలంగాణాలో బ్లాక్ ఫంగస్ కలకలం..

కరోనా మహమ్మారి భయంతో చాలా మంది చచ్చిపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు మరో వైరస్ కలకలం రేపుతోంది. బ్లాక్ ఫంగస్ అనే మరో కొత్త టెన్షన్ పట్టుకుంది. కరోనా బారిన కోలుకున్న వారిలో కొందరు బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా తెలంగాణలో పలు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది. నిర్మల్ జిల్లాలోని భైంసాలో ముగ్గురు బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. దీంతో జిల్లావ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. బ్లాక్ ఫంగస్ సోకిన వారిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులపై తెలంగాణ డీఎంఈ రమేశ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో మూడు బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ కేసులు కూడా ప్రైవేటు ఆసుపత్రిలో మూడు కేసులు పెరిగాయని తెలుస్తుంది.

ప్రైవేటు ఆసుపత్రులు బ్లాక్ ఫంగస్ కేసులను గాంధీ ఆసుపత్రికి పంపుతామని అడుగుతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఏడు బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయనడంలో వాస్తవం లేదని రమేశ్ రెడ్డి అన్నారు. అయితే కరోనా సోకిన ప్రతి ఒక్కరికి బ్లాక్ ఫంగస్ రాదని ఆయన వివరించారు. హైడోస్ స్టెరాయిడ్స్ వాడే కొందరిలో మాత్రం ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయంలో అనవసరంగా భయాందోళనలకు గురికావొద్దని ఆయన సూచించారు. వీటి తీవ్రతను త్వరగానే నయం చేయవచ్చినని తెలిపారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,862FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles