Sunday, July 25, 2021
spot_img

ఢిల్లీపై బ్లాక్ ఫంగస్ పంజా.. పెరుగుతున్న కేసులు..

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ప్రస్తుతం కొంతవరకు తగ్గిందని వైద్యులు వెల్లడించారు. అయితే మరణాల రేటు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.దీంతో ప్రజలు ఇంకా ఆందోళనలో ఉన్నారు.తాజాగా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూడటం కలవరం కలిగిస్తోంది. ఢిల్లీలో 50 మందికి బ్లాక్ ఫంగస్ సోకగా వీరిలో 40 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొవిడ్-19 రోగుల్లో విచ్చలవిడిగా స్టెరాయిడ్స్ వాడటంతోనే బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని పలువురు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.కొవిడ్ -19 నుంచి కోలుకున్న మధుమేహుల్లోనూ ఈ కేసులు వెలుగుచూస్తున్నాయి. మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులను నిరోధించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.

బ్లాక్ ఫంగస్ కేసులు ఇప్పుడు పలు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.ఢిల్లీతో పాటు కర్నాటక, ఉత్తరాఖండ్, ఏపీ, హర్యానా, మధ్యప్రదేశ్‌, బీహార్ రాష్ట్రాల్లోనూ బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూస్తున్నాయి.. మహారాష్ట్ర లో ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు కరోనా మూడో దశ కూడా వస్తుందని అంటున్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles