Sunday, July 25, 2021
spot_img

బ్లాక్ ఫంగస్ డేంజర్ బెల్.. పురుషుల్లోనే అధికం..

కరోనా మహమ్మారి మాట పూర్తిగా మరువక ముందే మరో వైరస్ దేశాన్ని భయాందోళనకు గురిచేస్తుంది. కరోనా కేసులు పెరుగుతున్నాయి.. అదే విధంగా బ్లాక్ ఫంగస్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. అయితే, బాధితుల్లో ఎక్కువ మంది పురుషులే ఉంటున్నారని నలుగురు భారత వైద్యుల బృందం అధ్యయనంలో తేలింది. కోల్ కతాలోని జీడీ హాస్పిటల్ అండ్ డయాబెటిస్ ఇనిస్టిట్యూట్ లో విధులు నిర్వర్తించే డాక్టర్ అవదేశ్ కుమార్ సింగ్, డాక్టర్ రీతూ సింగ్ , ముంబైలోని లీలావతి హాస్పిటల్ కు చెందిన డాక్టర్ శశాంక్, ఢిల్లీలోని నేషనల్ డయాబెటిస్, ఒబెసిటీ అండ్ కొలెస్ట్రాల్ ఫౌండేషన్ కు చెందిన డాక్టర్ అనూప్ మిశ్రాలు.. 101 మంది బ్లాక్ ఫంగస్ బాధితులపై అధ్యయనం చేశారు.

వీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొవిడ్ బాధితుల్లో బ్లాక్ ఫంగస్ తీరును పరిశీలించారు. బాధితుల్లో 79 శాతం మంది మగవారే ఉన్నారని గుర్తించారు. ప్రతి వందలో 31 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చనిపోతున్నారని తేల్చారు. 60 శాతం మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు, 41 శాతం మంది కోలుకున్నారని చెప్పారు. 83 శాతం మందికి మధుమేహం ఉందని, మూడు శాతం మందికి కేన్సర్ ఉందని నిర్ధారించారు. తస్మాత్ జాగ్రత్త సుమీ ఏదైనా ముందే జాగ్రత్త పడటం మంచిది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles