Tuesday, August 3, 2021
spot_img

తెలంగాణాలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు.. నలుగురు మృతి..

ఒక వైపు కరోనా కేసులు పూర్తీగా తగ్గక ముందే మరో వైరస్‌ కలకలం రేపుతోంది..బ్లాక్ ఫంగస్’ కేసుల గురించి విని మరింత బెంబేలెత్తుతున్నారు. మహమ్మారి రోగాలన్నీ వరుసగా విరుచుకుపడుతుండటంతో అంతటా ఒకరకమైన ఆందోళనకర వాతావరణం నెలకొంది. తెలంగాణలో సోమవారం(మే 17) ఒక్కరోజే ‘బ్లాక్ ఫంగస్’ సోకిన నలుగురు పేషెంట్లు మృతి చెందారు. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నవారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

నిజామాబాదు లో కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఒకే రోజు ముగ్గురు చనిపోగా, నల్గొండ లో ఒకరు చనిపొయారు..అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకూ రాష్ట్రంలో 10 మంది బ్లాక్ ఫంగస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో 16 మంది బ్లాక్ ఫంగస్ బారినపడిన పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో సోమవారం ఒక్కరోజే 25 మంది బ్లాక్ ఫంగస్ బారినపడిన పేషెంట్లు అడ్మిట్ అయ్యారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఇప్పటికే కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిని తెలంగాణ ప్రభుత్వం నోడల్ కేంద్రంగా మార్చింది. తాజాగా గాంధీ ఆస్పత్రిలోని ఈఎన్‌టీ విభాగం కూడా బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు శస్త్ర చికిత్స అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆస్పత్రిలోని 7వ అంతస్తులో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఇక్కడే ప్రత్యేక ఆపరేషన్ థియేటర్‌ను మరో రెండు రోజుల్లో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,882FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles