Sunday, July 25, 2021
spot_img

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ నుంచి రైతులకు 2000 వేయనున్నారు. ఎనిమిదో విడత పెట్టుబడి సాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం విడుదల చేయనున్నారు. ఈ విడతలో రూ. 19000 కోట్లను 9.5కోట్ల మందికి పైగా రైతులకు అందించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం నేడు ఓ ప్రకటనలో తెలిపింది. రేపు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సాయాన్ని మోదీ విడుదల చేస్తారని పేర్కొంది.

అంతేగాక, కార్యక్రమంలో భాగంగా కొంతమంది లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడుతారని తెలిపింది.ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ కూడా పాల్గొననున్నారు. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6000 పెట్టుబడి సాయాన్ని మూడు వాయిదాల్లో అందిస్తోంది. ప్రతి నాలుగు నెలలకోసారి రూ. 2వేల చొప్పున ఈ సాయాన్ని ఇస్తోంది.. ఇప్పటికే 7 విడతల డబ్బును అందించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles