Friday, July 23, 2021
spot_img

ఈ బర్గర్ తింటే 24 గంటల్లోనే పిల్లలను కనేస్తార.. నిజమా?

ఈ బర్గర్ తింటే 24 గంటల్లోనే పిల్లలను కనేస్తారట.. ఏంటి ఆ మాత్రం దానికే పిల్లలు పుడతారా.. ఇలాంటి సందేహాలు చాలా మందికి వస్తాయి. అది నిజమే అంటున్నారు అమెరికాలోని కొందరు ప్రముఖులు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మిన్నెసోటాలో ఉన్న సబ్అర్బన్ రెస్టారెంట్‌లో ఈ ప్రత్యేకమైన బర్గన్‌ను విక్రయిస్తున్నారు. దీన్ని ‘లేబర్ ఇండ్యూసర్’ బర్గర్ అని పిలుస్తారు. అయితే, ఇది కేవలం గర్బిణీలకు మాత్రమే కాదు. ఎవరైనా సరే ఆర్డర్ చేసుకుని తినొచ్చు.

అయితే, గర్భంతో ఉన్న మహిళలు మాత్రం ముందుగా ఈ బర్గర్ గురించి తెలుసుకొనే తినాలి. లేకపోతే.. అంచనా వేసిన తేదీ కంటే ముందు ప్రసవం జరిగే అవకాశాలు ఉన్నాయి.ఇప్పటివరకు ఈ బర్గర్ తిని సుమారు 31 మంది బిడ్డలను ప్రసవించారని రెస్టారెంట్ యజమాని నిర్వాహకులు తెలుపుతున్నారు. ఇందులో బీఫ్, పంచదారపాకంలో వేయించిన ఉల్లిపాయలు, మసాలాల సాస్, ఆవాలు, తేనెలో ముంచిన పంది మాంసం ముక్కలను ఈ బర్గర్‌లో పెడతారు. 2019 నుంచి ఈ రెస్టారెంట్‌లో ఈ ట్రెండ్ నడుస్తోంది. స్వయంగా రెస్టారెంట్ యజమాని కుమార్తెలే దీన్ని తిని పిల్లలకు జన్మనిచ్చారు. అందుకే వైద్యుల సలహా లేకుండా తినకూడదని అంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,864FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles