Sunday, July 25, 2021
spot_img

చిరంజీవి మరోసారి హీరో అయ్యాడు..

మెగాస్టార్ చిరంజీవి పేదల పాలిట అభయ హస్తం అనే చెప్పాలి.. ఈ మధ్య కరోనా కారణంగా ఆకలితో వున్న వాళ్ళకు తన వంతు సాయాన్ని అందించి రియల్ హీరో అయ్యాడు..బ్లడ్‌బ్యాంక్‌’, ‘ఐబ్యాంక్‌’ వేదికలుగా ఇంతకాలం ఎంతోమందికి సాయం అందించిన మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి మాట నిలబెట్టుకున్నారు. కరోనా బారినపడి సమయానికి ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోతున్న వారి కోసం చెప్పినట్టుగానే ‘చిరు ఆక్సిజన్‌ బ్యాంక్‌’లను ఆయన అందుబాటులోకి తీసుకువచ్చారు.

తెలుగు రాష్ట్రాలోని చాలా జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన ఇటీవల తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా బుధవారం ఉదయం అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ‘చిరు ఆక్సిజన్‌ బ్యాంక్‌’ సేవలు ప్రారంభమయ్యాయి.వారం రోజులలోపే వందలకొద్ది ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్‌సన్‌ట్రేటర్లు సంపాదించాం.

అనంతపురం, గుంటూరు జిల్లాల్లో బుధవారం నుంచి ‘చిరు ఆక్సిజన్‌ బ్యాంక్‌’ సేవలు ప్రారంభమవుతున్నాయి. గురువారం నుంచి ఖమ్మం, కరీంనగర్‌లతోపాటు మరో ఐదు జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆక్సిజన్‌ అందక ఎవరూ ఇబ్బందిపడకూడదు. ఇన్ని ఆక్సిజన్‌ సిలిండర్లు సంపాదించడానికి రామ్‌చరణ్‌ కూడా ఎంతో కృషి చేశాడు. నాకెంతో సంతోషంగా ఉంది” అని చిరు పేర్కొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles