Sunday, July 25, 2021
spot_img

పెళ్లిలో ఆకట్టుకున్న మాస్కులు..

పెళ్లికి ఎవరైనా దండలు వేసుకుంటారు.. కానీ ఇప్పుడు కరోనా భయంతో కొందరు షాక్ ఇస్తున్నారు. మహమ్మారి పై అవగాహన కల్పించేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు.. తాజాగా ఓ నూతన వధూవరులు వెరైటీగా పెళ్లిని చేసుకున్నారు. అదిలాబాద్ జిల్లా, బోథ్ మండల కేంద్రంలో వదూవరులు పూల దండలతోపాటు మాస్కులతో తయారు చేయించిన దండలు మార్చుకున్నారు. శనివారం సాయి శృజన్, రవికాంత్ లకు స్థానికంగా పెళ్లి జరిగింది. లాక్ డౌన్ క్రమంలొ అతి తక్కువమంది సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు.

ప్రభుత్వం విధించిన కోవిడ్‌ నిబంధనలు, మాస్కు ప్రాధాన్యత అందరికీ తెలియాలనే మాస్కులతో తయారు చేసిన దండలు వేసుకున్నట్లు కొత్త దంపతులు తెలిపారు.పెళ్లికి వచ్చినవారందరికీ మాస్కులు తప్పనిసరిగా ఉండేలా ముందే జాగ్రత్త పడ్డామన్నారు.సామాజిక దూరాన్ని పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటూ పిలుపునిచ్చారు.. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles