Sunday, July 25, 2021
spot_img

వచ్చే వారం నుంచి మార్కెట్ లోకి కొత్త వ్యాక్సిన్..

కరోనా పై నియంత్రణలో భాగంగా కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే రెండు ,మూడు రకాల టీకాలను మార్కెట్ లోకి తీసుకొచ్చారు. అయితే, ఇప్పుడు మరో టీకాను మార్కెట్లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది..రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను వచ్చే వారం నుంచి మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. అంతేకాకుండా అమెరికా ఎఫ్‌డీఏ, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన ఏ టీకానైనా దిగుమతి చేసుకోవచ్చని పేర్కొంది. వీటికి ఒకటి, రెండు రోజుల్లోనే అనుమతి ఇస్తామని తెలిపింది.

వ్యాక్సిన్‌ల దిగుమతి కోసం ఇప్పటివరకూ ఎలాంటి దరఖాస్తులు పెండింగ్‌లో లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వీ టీకా వినియోగానికి భారత్‌ ఇదివరకే ఆమోదం తెలిపింది. ఇప్పటికే టీకాలు మాస్కో నుంచి హైదరాబాద్‌ చేరుకున్నాయి. తొలి విడతలో భాగంగా 1.5 లక్షల వయల్స్‌ భారత్‌కు అందాయి. భారత్‌లో స్పుత్నిక్‌-వి క్లినికల్‌ ట్రయల్స్ నిర్వహించిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌కు చేరాయి. కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తర్వాత పంపిణీ చేసేందుకు రెడ్డీస్ సిద్దంగా ఉందని తెలుస్తోంది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles