Sunday, July 25, 2021
spot_img

భయ్యా.. నువ్వు సూపరేహే..

కరోనా మహమ్మారి అందరిలోని తెలివిని బయటకు తీసుకు వచ్చింది.. కొత్త కొత్త ఆలోచనలతో ఔరా అనిపిస్తున్నారు. ఇప్పుడు మరో ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది..తనకు సోకిన కరోనా బంధువులకు సోకకూడదనే ఉద్దేశ్యంతో ఓ వ్యక్తి చెట్టుపైనే హోం ఐసోలేషన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇంట్లో ఒకటే రూమ్ ఉండడంతో, ఎక్కడా ఉండటానికి వీలు లేకపోవడంతో తనకు సోకిన కరోనావైరస్ తన ఇంట్లోవాళ్లకు కూడా సోకుతుందేమోనని భావించిన ఓ వ్యక్తి తన కోసం విచిత్రమైన షెల్టర్ ఏర్పాటు చేసుకున్నాడు.

చెట్టు కొమ్మల మద్య మంచాన్ని కట్టీ అక్కడే కానా, పినా , సోనా కానిస్తున్నాడు..ఇతడు చేసిన ఆలోచన విచిత్రంగా ఉండటంతో అందరి దృష్టి అతనిపైనే పడింది. వివరాల్లోకివెళితే..ఈ ఘటన నల్లగొండ జిల్లా, అడవిదేవులపల్లి మండలం, కోతనందికొండ గ్రామంలో వెలుగులోకి వచ్చింది..గ్రామానికి చెందిన రమావత్ శివ అనే యువకుడికి కూడా కరోనా సోకింది. దాంతో ఇంట్లోవారికి తన వల్ల కరోనా వస్తుందన్న భయమో లేక చిన్న ఇంట్లో విడిగా ఉండే అవకాశం లేదనే భావనో కానీ.. ఏకంగా ఇంటి ముందు చెట్టు మీద తన కోసం విడిగా నివాసం ఏర్పరుచుకున్నాడు. ఇతను ఇలానే గత తొమ్మిది రోజుల నుంచి ఉన్నాడు.ఇంట్లోవాళ్లు శివ కోసం నీళ్లు, భోజనం కింది నుంచి పంపిస్తే.. భోజనం చేసి అక్కడే పడుకుంటున్నాడు. ఇంట్లో ఒకటే రూమ్ ఉండడంతో.. ఎక్కడా ఉండటానికి వీలు లేకపోవడంతో ఇలా ఏర్పాటు చేసుకున్న అతను చెప్పుకొచ్చాడు.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles