Tuesday, August 3, 2021
spot_img

టీకాకు దూరంగా ఎవరు ఉండాలో తెలుసా?

కరోనా ఉదృతి అత్యంత వేగంగా వ్యాపిస్తుంది.. అయితే టీకా పంపిణీ కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది.అయితే భారత దేశంలో ఉన్న అందరికీ టీకాలను ప్రభుత్వం అందించలేక పోతుంది.. దీంతో కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌ బృందం రూపొందించింది.. అవేంటో ఒకసారి క్షుణ్ణంగా చూ సెద్దాం.. కరోనా వచ్చి కోలుకున్నవారు మూడు నెలల తర్వాత టీకా తీసుకోవాలని నిపుణులు ముందు నుంచీ సూచిస్తున్నారు. ఎందుకంటే వారిలో అప్పటికే యాంటీబాడీలు తయారయ్యి ఉంటాయి. కాబట్టి వారు కొన్ని నెలల తర్వాత టీకా తీసుకుంటే మంచిదని అంటున్నారు.

కొవిడ్‌ నుంచి కోలుకున్న వ్యక్తుల ప్లాస్మాను కరోనా బాధితుల్లో ప్రవేశపెడతారు. అందులో ఉండే యాంటీబాడీల వల్ల వీరికి కరోనా నుంచి రక్షణ లభిస్తుంది. వీరు తీసుకున్న ప్లాస్మాలో ఉండే ప్రొటీన్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. వీరు కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మూడు నెలల తర్వాత ఈ టీకాను తీసుకోవచ్చు..ఇకపోతే.. మొదటి టీకాను తీసుకున్న కూడా పాజిటివ్ వచ్చిన వాళ్ళు..కొవిడ్‌ టీకా మొదటి డోసు తీసుకున్న తర్వాత పాజిటివ్‌ వచ్చినవారు కూడా కనీసం మూడు నెలల తర్వాత మరొక డోసును తీసుకోవాలని కేంద్రం సూచించింది.కరోనా కాకుండా వేరే రోగాలతో ఆనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఈ కరోనా టీకా వేసుకున్నా పని చేయదు.. దీంతో టీకాను మరో రెండు నెలలు వాయిదా వేసుకోవాలని అంటున్నారు. ఇక గర్భిణీలు..కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వాలా వద్ద అంశంపై చర్చలు జరుగుతున్నాయని కేంద్రం తెలిపింది.

దీనిపై నిర్ణయం తీసుకొనేవరకు గర్భిణులు టీకా తీసుకోకూడదని కేంద్రం సూచించింది.టీకా తీసుకొనే ముందు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టు చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. టీకా తీసుకున్న 14 రోజుల తర్వాత, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చిన తర్వాత 14 రోజులకు ఎవరైనా రక్తదానం చేయొచ్చని కేంద్రం కొత్త మార్గదర్శకాల్లో వెల్లడించింది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,883FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles