Sunday, July 25, 2021
spot_img

వియత్నాంలో కరోనా హైబ్రిడ్‌ గుర్తింపు..

కరోనా తీవత్ర జనాలను భయం తో వణికిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది నుంచి ప్రపంచాన్ని వదిలి పెట్టలేదు..ఇప్పటికే కరోనా వేరియంట్స్‌తో అన్ని దేశాలు ఇబ్బందులు పడుతుంటే….. కొత్తగా కరోనా హైబ్రిడ్‌ రకం వెలుగు చూసింది. గత వేరియంట్‌లను మించి ప్రమాదకరంగా ఈ హైబ్రిడ్‌ రకం విస్తరిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి..

ఇప్పటికే వియత్నాం లో కొత్త వైరస్ కలకలం రేపుతోంది..మొదట వచ్చిన వైరస్‌లతో పోల్చితే హాని చేయడంలో మార్పు చెందిన వైరస్‌ వేరియంట్లు చాలా ప్రమాదకరం. అయితే తాజాగా ఇలా రూపు మార్చుకున్న రెండు ప్రమాదకర వేరియంట్ల నుంచి అ‍త్యంత ప్రమాదకరమైన సంకర జాతి కరోనా వైరస్‌ పుట్టుకొచ్చింది.. ఇప్పటికే అక్కడ ఏడు రకాల వేరియంట్ లను కనిపెట్టినట్లు తెలుస్తుంది..

హైబ్రిడ్‌ రకం మ్యూటెంట్‌కు అడ్డకట్ట వేయడం కష్టంగా మారింది. ఇప్పటికే ఆ దేశంలో 6,396 మంది కరోనా బారిన పడగా 47 మంది మరణించారు. దేశంలో రోజురోజుకి హైబ్రిడ్‌ రకం ప్రమాదకరంగా విస్తరిస్తుండటంతో వియత్నాం ప్రజలు ప్రాణ భయంతో వణికిపోతూ వున్నారు…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles