Sunday, July 25, 2021
spot_img

వావ్.. ఈ వెరైటీ స్నాక్ అదిరిపోలే..

ఆలూ తో చాలా రకాల వెరైటీలను చేసుకోవచ్చు.. ముఖ్యంగా స్నాక్స్ చేసుకుంటే ఉంటుంది..తింటే అస్సలు వదలరు..సైడ్ డిష్ గా వీటిని ఎక్కువగా ఇష్టపడతారు. వెరైటీ గా , రుచిగా ఉండేలా ట్రై చేయాలని అనుకునేవాళ్లు ఇలా చెయ్యాల్సిందే..

కావాల్సిన పదార్థాలు

పావుకిలో బంగాళదుంపలు (చిన్నవి)

1టేబుల్ స్పూన్ వెన్న లేదా అంతకన్నా ఎక్కువ
కొన్ని రోజ్ మేరీ ఆకులు
రుచికోసం తగినంత ఉప్పు
నల్లమిరియాలు ( దంచినవి)
1టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్
కొంత నిమ్మరసం
3వివిధ రకాలైన క్యాప్సికమ్

ఒక పాత్రలో చిన్న బంగాళ దుంపలని తీసుకుని వాటిని ముక్కలుగా కాకుండా ముద్ద వంకాయలని కోసిన మాదిరిగా కోసుకోవాలి.వెన్న, నెయ్యి, రోజ్ మేరీ ఆకులతో దంచిన నల్ల మిరియాల పొడిలో ముంచాలి.పెనం తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్ వేసి వేడి అయ్యేవరకు పొయ్యి మీద ఉంచాలి. ఆ తర్వాత కొన్ని మిరపకాయలతో పాటు రాక్ సాల్ట్ వేసి బంగాళదుంపలని పెనంలో వేయాలి.అది అలా పెనం మీద వేడి అవుతూ ఉండాలి. బంగాళ దుంపలు కరకరలాడేలా తయారయ్యే వరకు ఏమీ అనకూడదు. ఆ తర్వాత కొన్ని రోజ్ మేరీ ఆకులని అందులో వేయాలి. తర్వాత ఆలూ ను వేరే బౌల్ లోకి తీసుకోవాలి.. క్యాప్సికమ్ తీసుకుని ఒక పాత్రలో వేయించాలి. అందులో మిరియాలని వేయాలి. కొద్దిగా వేగిన తర్వాత పక్కన ఉంచుకోవాలి. వాటి పై కలర్ ఫుల్ కోసం కొత్తిమీరను వేసి గార్నిష్ చేస్తే సరి నోరూరించే ఈ ఫ్రై రెడీ..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles