Saturday, July 17, 2021
spot_img

రాత్రి చపాతీలు తింటున్నారా ?

ఈ మధ్య చాలా మందికి పొట్ట వస్తుండటం చూస్తున్నాం.. చూడటానికి చాలా ఇకారంగా, ఇబ్బందిగా ఉంటుంది.. దాన్ని తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయతింస్తుంటారు. ముఖ్యంగా చపాతీలు తినడం అలవాటు చేసుకుంటారు.. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నాయేమో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

రాత్రి వేళల్లో అన్నం మానేసి చపాతీలు తింటుంటారు. అయితే ఉన్నఫలంగా అన్నం మానేసి చపాతీలు తినడం మంచిది కాదని డాక్టర్లు అంటున్నారు. ఒక పూట అన్నం పూర్తిగా మానేసే బదులు.. అన్నం తక్కువ తీసుకుని.. ఆ స్థానంలో చపాతీలు తినమని సూచిస్తున్నారు. అలాగే రాత్రిపూట వేడివేడిగా చేసుకునే చపాతీలు కంటే నిల్వ ఉన్న చపాతీలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.

అలాగే అప్పటికప్పుడు చేసిన చపాతీల్లో నూనె కంటెంట్ తక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.సాధారణంగా ఎక్కువ సేపు నిల్వ ఉండే ఆహార పదార్ధాలలో పోషకాలు అంతమైపోతాయి. అయితే చపాతీలు, రోటీలు ఎంత ఎక్కువ సేపు నిల్వ ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదని డాక్టర్లు తెలిపారు. అందుకే కాస్త నిల్వ ఉంచిన చపాతీలను తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. బ్లడ్ ప్రెషర్, అల్సర్స్, గ్యాస్ వంటి కడుపు సంబంధిత రోగాలు దరికి చేరవని వైద్య నిపుణులు అంటున్నారు. మరోవైపు రక్త హీనతతో బాధపడుతున్న వారికి కూడా చపాతీలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,862FollowersFollow
18,000SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles