Sunday, July 25, 2021
spot_img

కరోనా పై ఇండియాలో ఫేస్ బుక్ సరి కొత్త రూల్..

కరోనా మహమ్మరి ప్రభావం నుంచి జనాలు బయటపడే మార్గాన్ని వెతుకుతున్నారు.. కానీ కరోనా ముందు అవి పనిచేయడం లేదు. ప్రపంచంలో కరోనా పరిస్థితిని గురించి తెలుసుకునెందుకు ఫేస్ బుక్ సరికొత్త ఆలోచన చేసింది.సంబంధిత వార్తలను ప్రజలు ఎప్పటికప్పుడు సకాలంలో షేర్ చేసుకునే విధంగా ఈ టూల్ ఉపకరిస్తుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఆరోగ్య శాఖలు పరస్పరం కొవిడ్ సంబంధిత అప్‌డేట్లను తెలుసుకునేందుకు ఈ టూల్‌ను రూపొందించారు.

కరోనా కారణంగా తలెత్తిన ప్రజారోగ్య సంక్షోభం నేపథ్యంలో ప్రజలను సురక్షితంగా, అప్రమత్తంగా ఉంచేందుకు కృషిచేస్తున్న ప్రభుత్వ ఆరోగ్య సంస్థల అధికారులకు మద్దతుగా ఈ టూల్ ప్రవేశపెడుతున్నట్టు ఫేస్‌బుక్ వెల్లడించింది. ఈ టూల్‌ను తొలుత అమెరికాలో ఆవిష్కరించారు. తాజాగా దీన్ని అందుకుంటున్న రెండో దేశంగా భారత్ నిలిచింది…

ఇందు కోసం మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆరోగ్య శాఖల్లోని అధికారులు తమ పరిధిలో కొవిడ్-19, వ్యాక్సినేషన్‌పై ఎప్పటికప్పుడు ఈ టూల్ ద్వారా ప్రజలకు సమాచారం ఇస్తారు.ఫేస్‌బుక్ పేజీల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు పెట్టే పోస్టులను కొవిడ్-19 ప్రకటనలుగా గుర్తించి… ప్రజలకు అవి మరింత త్వరగా వెళ్లే విధంగా వాటిని వ్యాపింపచేస్తుంది. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు త్వరగా సమాచారం అందించేందుకు.. ఫేస్‌బుక్ ఆ ప్రాంతంలోని ప్రజలందరికీ నోటిఫికేషన్లు పంపిస్తుంది.. కరోనా పై ముఖ్య సమాచారన్ని అందించెందుకు ఈ టూల్ ను అందుబాతులొకి తీసుకొచ్చింది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles