Sunday, July 18, 2021
spot_img

గాల్లో ఒకటైన జంట.. ఫొటోస్ వైరల్..

పెళ్ళిల్లు ఈ మధ్య వింతగా జరుగుతున్నాయి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..ఇప్పుడు జరిగిన ఓ పెళ్ళి కూడా జనాలను ఆష్చర్యానికి గురిచెసింది..ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మరి ప్రభావం పెరుగుతుందన్న సంగతి తెలిసిందే.. దీంతో వేడుకలకు గట్టి దెబ్బ తగిలింది. కరోనా నిబంధనలు పాటిస్తూ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి..

వివరాల్లోకి వెళితే.. మధురైకి చెందిన రాకేష్, దక్షిణలు పెళ్లి మదురై అమ్మవారిలో సన్నిధిలో మంగళవారం జరగాల్సి ఉంది. అయితే కరోనా ప్రభావంతో తమిళనాడు ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించింది. లాక్‌డౌన్‌ విషయం తెలియడంతో పెళ్లి కోసం చేసుకున్న ఏర్పాట్లను రద్దు చేసుకున్నారు. కానీ తమ పెళ్లిని మాత్రం వాయిదా వేసుకోవలనుకోలేదు. ఇరు కుటుంబ సభ్యులు మొత్తం 161 మంది కలిసి రెండు గంటల కోసం ప్రత్యేకంగా విమానం అద్దెకు తీసుకున్నారు. వీరంతా బెంగళూరు నుంచి మదురైకి బయలు దేరి వెళ్లారు. విమానం టేకాఫ్‌ అయిన తరువాత గాల్లోనే పెళ్లి కొడుకు పెళ్లి వధువుకి తాళి కట్టి ఒకటవ్వగా.. కుటుంబ సభ్యులు వీరిని ఆశీర్వదించారు. తిరిగి మళ్లీ మదురై నుంచి బెంగళూరుకు ప్రయాణమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,863FollowersFollow
18,000SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles