Saturday, July 24, 2021
spot_img

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం..

మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటూ వస్తున్నా కూడా మహిళలపై అత్యాచారాలు జరగడం అమానుషం. ఇది సమాజం సిగ్గుతో తల దించుకునే పని. తూర్పుగోదావరి జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది.. జిల్లాలోని ఉప్పలగుప్తం మండలానికి చెందిన 21 ఏళ్ల యువతి రెండు వారాల క్రితం అల్లవరంలోని తమ బంధువుల ఇంటికి వచ్చింది.ఈ సందర్భంగా స్నేహితుడితో కలిసి కొమరగిరిపట్నం కడదరి ప్రాంతంలో సముద్రం ఒడ్డుకు వెళ్లింది. అప్పటికే అక్కడ సీతారామపురానికి చెందిన ఇద్దరు యువకులు మద్యం తాగిన మత్తులో ఉన్నారు. అలాగే సత్యనారాయణపురానికి చెందిన మరో వ్యక్తి కూడా ఉన్నాడు.

యువతీయువకులను చూసిన ఈ ముగ్గురూ వారిని సమీపించి యువకుడిపై దాడిచేసి బంధించారు. ఆమె పై అతి దారుణంగా అత్యాచారం చేశారు. అప్పుడు న్యూడ్ ఫోటోలను కూడా తీశారు.. తర్వాత వదిలిపెట్టారు.. పది రోజుల తర్వాత నిందితుల్లో ఒకడు యువతికి ఫోన్ చేసి తన కోరిక తీర్చాలని, లేదంటే తన వద్ద వున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో భయపడిన బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,866FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles