Tuesday, August 3, 2021
spot_img

గోంగూర లో గొప్ప ఔషదాలు..

గోంగూర పేరు వినగానే చాలా మందికి నీళ్ళు ఊరతాయి..గోంగూరలో పొటాషియం, ఐరన్ లాంటి లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చక్కర స్థాయిని తగ్గించి షుగర్ రాకుండా చేస్తాయి. అంతేకాదు రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

గోంగూరలో విటమిన్ ఏ, బి 1, బి 2, బి 9 తోపాటు విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ కంటి సంబంధిత సమస్యలను రాకుండా చేస్తుంది. రేచీకటిని కూడా రాకుండా చేస్తుంది. అంతేకాదు కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి కనీసం వారానికి రెండు సార్లయినా గోంగూరను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. దీనిలో చాలా తక్కువ కొవ్వు ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఇంకా రక్త పోటు..గుండె, కిడ్నీ సంబంధ సమస్యలు, కాన్సర్ వంటి సమస్యలను కూడా నివారించడంలో సహాయపడుతుంది. దగ్గు, ఆయాసంతో బాధపడేవారు గోంగూరను తీసుకుంటే మంచిది. గోంగూరను ఎండబెట్టి పొడి చేసి చర్మ సమస్యలు వచ్చినప్పుడు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.గోంగూర పేస్ట్ ను జుట్టు, ముఖానికి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,882FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles