Sunday, July 18, 2021
spot_img

బంఫర్ ఆఫర్.. టీకా వేసుకోండి.. రూ. 840 కోట్లు గెలుచుకోండి..

టీకా వేసుకోండి.. రూ. 840 కోట్లు గెలుచుకోండి.. ఇదేదో వినడానికి కొత్తగా ఉన్నా కూడా ఇది నిజం.. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఓ వినూత్న ఆలోచన చేసింది. కరోనా అడ్డుకట్ట వేసేందుకు అక్కడ ప్రభుత్వం దేశ పౌరులందరికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, టీకా వేయించుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఇప్పటి వరకు 63 శాతం జనాభాకు మాత్రమే టీకాలు ఇచ్చారు. మిగిలిన వారిని కూడా వ్యాక్సిన్ దిశగా ప్రోత్సహించేందుకు లక్కీ డ్రా ప్రకటించింది. నిజానికి ఇక్కడ 12 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు.

టీకా తీసుకునేందుకు యువత విముఖత ప్రదర్శిస్తుండడంతో వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకు భారీ బహుమతి ప్రకటించింది.ప్రైజ్ మనీని ప్రకటించింది. తొలి డోసు తీసుకున్న వారు ఈ లక్కీ డ్రాకు అర్హులని గవర్నర్ గవిన్ న్యూసమ్ తెలిపారు. ఇలాంటి ఆఫర్‌నే ఇప్పటికే ఒహాయో, కొలరాడో, ఒరేగాన్ రాష్ట్రాలు ప్రకటించాయి…వచ్చే నెల 15 నుంచి కరోనా ఆంక్షలు ఎత్తివేయాలని, మునుపటి పరిస్థితి తీసుకురావాలని సంకల్పించిన ప్రభుత్వం ఇందుకోసం వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది..మన దేశంలో కూడా ఇలాంటి ఆఫర్ పెడితే బాగుండు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,863FollowersFollow
18,000SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles