Sunday, July 25, 2021
spot_img

పుదీనా లో దాగి ఉన్న పుట్టెడు ఆరోగ్యం..

ప్రకృతిలో మనకు దొరికే ప్రతి ఒక్క మొక్కలోనూ, ఆకులోనూ ఏదో ఒక ఔషధ గుణం కలిగి ఉంటుంది. మరీ ముఖ్యంగా పుదీనా గురించి చెప్పుకోవాల్సింది చాలా ఉంది. అయితే పుదీనాను కేవలం రుచికి,వాసనకు మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకూ, సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఉపయోగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పుదీనా వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. పుదీనాలో ముఖ్యంగా విటమిన్ సీ,విటమిన్ డీ,విటమిన్ ఇ, విటమిన్ బీ లు అధికంగా ఉండడంతో పాటు క్యాల్షియం, పాస్పరస్ వంటి మూలకాలు వలన రోగనిరోధక శక్తి పెరిగి, అనారోగ్యాలు సైతం దూరం అవుతాయి. అంతేకాకుండా పుదీనా రక్తప్రసరణను క్రమబద్దీకరించడమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. కడుపులో మంట, గొంతునొప్పివంటి సమస్యలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

పుదీనా ఆకులను మెత్తగా పేస్ట్ చేసి, ఈ మిశ్రమంతో దంతాలు తోముకోవడం వల్ల పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఒక పుదీనా ఆకుల రసంలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకొని తీసుకోవడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం, వికారం, వాంతులు వంటి సమస్యల నుండి బయటపడవచ్చు. చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్ఫెక్షన్ లకు తాజా పుదీనా ఆకులను కొన్ని చేతితో నలిపి రసం లా తీసి, ఆ రసం లో దూది అద్ది, ఒక్క చుక్క ప్రకారం చెవిలో,ముక్కు లో వేస్తూ ఉంటే ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గిపోతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles