Monday, August 2, 2021
spot_img

లవంగాల తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో..

వంట గదిలో వుండే అన్నీ కూడా మనకు మంచి మెడిసిన్ లే.. ఇప్పుడు మనం లవంగాల గురించి తెలుసుకుందాం..

ఒంట్లో జబ్బుల నివారణకు కూడా లవంగం బాగా పనిచేస్తుంది. కడుపులో వికారానికీ, దంత ఆరోగ్యానికీ మన పోపుల డబ్బాలో లవంగం ఉంటే చాలంటున్నారు ఆయుర్వేద వైద్యులు.పంటి సమస్యలకు లవంగ మొగ్గ, లవంగ నూనె చక్కటి ఔషధాలు.లవంగాలు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఫలితంగా శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. అంతేగాక లవంగాలు గుండెపోటు రాకుండా నివారించడంలో కూడా పరోక్షంగా సహకరిస్తాయి.

ఎందుకంటే ఇవి రక్తాన్ని పలుచబరుస్తూ గడ్డ కట్టకుండా (బ్లడ్‌ క్లాట్స్‌) నివారిస్తాయి.పిప్పిపన్ను నొప్పి పెడుతుందంటే లవంగ మొగ్గను చిదిమి పిప్పి ఉన్న చోట పెట్టాలి… అంతే కాదు వీటి నూనెను పిప్పి పన్ను దగ్గర పెడితే నొప్పి తగ్గిపోతుంది.. లవంగాన్ని మెత్తగా నూరి, మొటిమల మీద రాస్తే, మొటిమ పక్కకు విస్తరించకుండా త్వరగా రాలిపోతుంది. ఇలా రాసేటప్పుడు మొటిమ పక్కన సాధారణ చర్మానికి తగలకుండా జాగ్రత్తపడాలి.

వాంతి అవుతుందనిపించినప్పుడు లవంగాన్ని వాసన చూడాలి. అలాగే లవంగం రసాన్ని చప్పరించినా ఫలితం ఉంటుంది.దగ్గు వదలకుండా బాధిస్తుంటే లవంగం మొగ్గను బుగ్గన పెట్టుకుని మెల్లగా నములుతూ రసం మింగాలి.ఎటువంటి ఇంఫెక్షన్ లు ఉన్నా కూడా తగ్గి పోతాయి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,879FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles