Tuesday, August 3, 2021
spot_img

హెల్తీ ఓట్స్ సలాడ్ ను ఇలా చేస్తే అదిరిపోతుంది..

ఓట్స్ తెలియని వాళ్ళు ఉండరేమో.. అయితే ఇప్పుడు వీటితో రక రకాల వంటలను చేసుకోవచ్చు.. ఇంకాస్త వెరైటీ గా చేసుకోవాలని అనుకుంటే ఇలా ఓట్స్ తో వెజిటబుల్ సలాడ్ ను చేసుకోని తింటే చాలా బాగా ఉంటుందని అంటున్నారు.. ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

కావలసిన పదార్థాలు:

అర కప్పు, పాలు: రెండు టేబుల్‌ స్పూన్లు, క్యారెట్‌: ఒకటి, క్యాప్సికమ్‌: ఒకటి, టమాట: ఒకటి, ఉల్లిపాయ: ఒకటి, మిరియాల పొడి: అర టీ స్పూన్‌, ఉప్పు: తగినంత, నిమ్మరసం: రెండు టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు: ఒక టీ స్పూన్‌, పుదీనా: కొద్దిగా.

తయారీ విధానం:

ముందుగా ఓట్స్‌ని పాలలో నానబెట్టుకోవాలి. క్యారెట్‌, క్యాప్సికమ్‌, టమాట, ఉల్లిపాయలను చిన్నగా తరగాలి. ఒక బౌల్‌లో ఓట్స్‌, కూరగాయ ముక్కలు, మిరియాలపొడి, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. చివరగా పుదీనా, కొత్తిమీర తరుగుకూడా వేసి మరోసారి కలిపి సర్వ్‌ చేసుకుంటే సరి. ఆరోగ్యకరమైన ఓట్స్‌ వెజిటెబుల్‌ సలాడ్‌ రెడీ.. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,882FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles