Sunday, July 25, 2021
spot_img

వంటింటి వైద్యం..

మన వంటిల్లు చక్కటి వైద్యశాల అని చాలా మందిని అంటున్నారు. అక్కడ పోపుల డబ్బాలో దొరికే అన్నీ కూడా ఒక్కో ఆరోగ్య సమస్యను అధిగమించవచ్చు.. దీర్ఘకాలిక సమస్యలను కూడా ఇవి నయం చేస్తాయట అవేంటో ఒకసారి చూద్దాం..

జీలకర్ర :

నిమోనియా నివారిణిగా ఉపయోగపడుతుంది. దీనిలో ఐరన్‌, కాపర్‌, పొటాషియం, మెగ్నీషియం వంటి మూలకాలతో పాటు విటమిన్‌-సి ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ఉపకరిస్తుంది.

పసుపు:

దీనిలోని కర్క్యుమిన్‌ అనే రసాయనం వ్యాధి నిరోధకశక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. సహజ పెయిన్‌కిల్లర్‌గా, రక్తంలో గ్లూకోజ్‌, కొవ్వుల స్థాయిని నియంత్రించేందుకు సహకరిస్తుంది. శ్వాసకోశం సవ్యంగా పనిచేయడానికి ఉపకరిస్తుంది.

లవంగాలు :

జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతాయి.యాంటీవైరల్‌,యాంటీ బ్యాక్టీరియల్‌ పదార్థంగా పనిచేసి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.

అల్లం :

దీనిలోని జింగోల్స్‌ అనే రసాయనాలు శ్వాస వ్యవస్థను పటిష్టం చేసి రక్తంలో ఆక్సిజన్‌ శాతాన్ని పెంచుతాయి.

ధనియాలు :

ధనియాలు, శొంఠి మరిగించిన మిశ్రమాన్ని ధాన్య కఘృతం అంటారు. దీనిని సేవించడంతో శరీరంలో చల్లదనం ఏర్పడుంది. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి నియంత్రణ, జీర్ణశక్తి పెరుగుతాయి.

మెంతులు :

గాలక్టోమన్నన్‌ అనే యోగకం కండరాల సామర్థ్యాన్ని పెంచుతుంది.ప్రతి 100గ్రాముల మెంతుల్లో 34గ్రాముల ఐరన్‌ ఉంటుంది. ఫలితంగా రక్త శుద్ధ్దీకరణకు దోహదపడుతుంది.

మిరియాలు :

మసాలాల్లో రాజుగా పరిగణింపబడే ఈ పదార్థంలో ఉండే పెప్పరైన్‌ అనే రసాయనం జీర్ణవ్యవస్థ పనితీరుపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది.

యాలకులు :

ఊపిరితిత్తుల్లో గాలిప్రసరణను పెంచి శ్వాసవ్యవస్థకు సహాయపడతాయి.వీటిలో వ్యాధినిరోధకశక్తిని పెంచే ఆల్కలాయిడ్లు, ప్లవోనాయిడ్లతో పాటూ క్యాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, పాస్పరస్‌, సోడియం వంటి మూలకాలు, బీ1,బీ2,బీ3,బీ6, సీ విటమిన్లు ఉంటాయి.

వెల్లుల్లి:

పాకహర్షంగా పిలుస్తారు. క్యాల్షియం మూలకాన్ని అధికంగా కలిగి ఉంటుంది.మంచి సూక్ష్మజీవి నాశినిగా పనిచేస్తుంది. శరీరంలోని అదనపు కొవ్వు కరగడానికి,రక్తప్రసరణ వ్యవస్థను మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

ఇవన్నీ కూడా సకల రోగాలా నుంచి మనల్ని కాపాడుతాయి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles