Sunday, July 18, 2021
spot_img

చక్కెరను తగ్గించేస్తున్నరా.. అయితే ఈ ప్రమాదాలు తప్పవు..

చక్కెరను తింటే షుగర్ వస్తుందని చాలా మంది నమ్ముతారు.. అంతేకాదు లావు అవుతారని కూడా భావించి అసలు తినడమే మానెస్తారు.. అలా చేయడం వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవి ఒకసారి చూద్దాం..
చప్పగా ఉన్నా అలాగే అడ్జస్ట్ అవుతూ ఉంటారు. కానీ షుగర్ పూర్తిగా మానేయడం మంచిది కాదు. డయాబెటిస్ ఉన్నవారు… షుగర్ పట్ల కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే కానీ… డయాబెటిస్ లేనివారు కూడా చక్కెరను చూసి అతిగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. మన శరీరానికి ఎక్కువ చక్కెర ఎంత ప్రమాదమో… చక్కర తక్కువగా ఉంటే కూడా ప్రమాదమే.

గొంతు మంటగా ఉండేవారికి చెరకు గడ రిలీఫ్ ఇస్తుంది. యాంటీ బయోటిక్‌లా పనిచేస్తుంది. చెరకుగడ నములుతూ ఉంటే… మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఐతే… ఇదే చెరకు నుంచి తయారుచేసే పంచదారలో… కొన్ని రసాయనాలు, పొడులు కలుపుతారు కాబట్టి… చక్కెరను మరీ ఎక్కువ, మరీ తక్కువ కాకుండా బ్యాలెన్స్‌గా తీసుకోవాలి..

అటు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా తీసుకుంటే మంచిది..చక్కెర స్థానంలో బెల్లం వాడటం మేలు. నల్లబెల్లం అయితే ఇంకా మంచిది. పసుపు రంగులో ఉండే బెల్లం కంటే… ఎరుపు, నలుపు రంగులో ఉండేదే మంచి బెల్లం అని మర్చిపోకండి. పసుపు రంగు బెల్లంలో అలా కనిపించేలా కెమికల్స్ కలుపుతారు. కాబట్టి… అది మంచిది కాదు. సో, పంచదార వాడండి. అలాగని ఎక్కువగా కాకుండా జాగ్రత్తగా వాడటం మంచిది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,865FollowersFollow
18,000SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles