Thursday, August 5, 2021
spot_img

పనీర్ ను ఇలా చేస్తే అస్సలు పాడవ్వదు..

ప నీర్‌ను ఒకట్రెండు రోజుల వరకు నిల్వ చేయాలనుకుంటున్నారా. అయితే గిన్నెలో పనీర్‌ ముక్కలు వేసి అవి మునిగేలా నీళ్లు పోసి ఫ్రిజ్‌లో పెట్టేయండి. ఒకవేళ పనీర్‌ పూర్తిగా మునగకపోతే అది గట్టిగా మారుతుంది. పసుపు రంగులోకి మారి, పనీర్‌ పులుపెక్కే అవకాశం కూడా ఉంది. వారంపాటు పాడవకుండా ఉండాలంటే.. గిన్నెడు చల్లటి నీటిలో చెంచా ఉప్పు కలపాలి.

ఆ తర్వాత నీటిలో ముక్కలు వేసి మూత పెట్టి ఫ్రిజ్‌లో పెట్టేయాలి. అయితే రెండు రోజులకోసారి నీళ్లు, గిన్నెనూ మార్చడం మరవొద్దు. ఇలా వారం పాటు చేయాలి. ఓ నెలపాటు భద్రపరచాలనుకుంటే…పనీర్‌ను ముక్కలుగా కోసి ట్రేలో వేసి ఫ్రీజర్‌లో భద్రపరచండి. పనీర్‌ గట్టిగా మారిన తర్వాత ఆ ముక్కలను జిప్‌లాక్‌ బ్యాగులో వేసి మళ్లీ ఫ్రీజర్‌లో దాచేస్తే సరిపోతుంది.. కావాలి అనుకున్నప్పుడు వాటిని తీసి గోరువెచ్చటి నీటిలో వేయాలి. అప్పుడవి మృదువుగా తయరవుతాయి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,884FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles