Thursday, August 5, 2021
spot_img

బిస్కెట్లంటే భయపడుతున్న హైదరాబాదీలు.. ఎందుకంటే ?

డబ్బులకు కక్కుర్తి పడి చాలా దుకాణదారులు చిన్న పిల్లల ప్రాణాలను తీస్తున్నారు..ఇటీవల కర్నూల్ జిల్లా బిస్కెట్ ఘటన మర్చిపోకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎక్స్పైర్ అయిన బిస్కెట్ లను తిని నలుగురు చిన్నారులు అశ్వస్తకు గురయ్యారు.. డబ్బులు కోసం దురాశకు పోయిన షాప్ యజమాని ఈ దారుణానికి ఒడిగట్టారు. ఎక్స్పైరీ డేట్ దాటిన పతంజలి బిస్కెట్లు తిన్న ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్ గూడ ప్రాంతంలో పతంజలి ఆరోగ్య కేంద్ర స్టోర్స్ లో చోటుచేసుకుంది.

ఆ స్టోర్ కు స్థానికంగా ఉండే ఓమ్‌రెడ్డి అనే వ్యక్తి 10 బిస్కెట్ ప్యాకెట్లు కొనుగోలు చేశాడు. అయితే వాటిని ఓమ్‌రెడ్డి తన పిల్లలకు తినిపించాడు. వాటిని తిన్నాక పిల్లలకు వాంతులవడం ప్రారంభం అయ్యాయి. పిల్లలు తేల కళ్లు వేశారు.. దీంతో కంగారు పడ్డ తన తండ్రి కరోనా వచ్చిందనే అనుమానంతో హుటాహుటీన ఆసుపత్రికి పరుగెత్తాడు.చికిత్స చేసిన వైద్యులు ఫుడ్ ఫాయిజన్ అని చెప్పారు.అయితే అతడు తను తీసుకున్న బిస్కెట్ ప్యాకెట్లను తీసి చూశాడు. అవి ఎక్సపైరీ డేట్ అయిపోయి ఉంది. దీంతో ఈ విషయం గురించి షాప్ కు వెళ్లి ఓనర్ ను నిలదీయగా,అతడు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది..

అయితే, ఇక అతనికి బుద్ది చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. దీంతో ఆ షాప్ ఎదుట అతడు ధర్నాకు దిగాడు.అనంతరం రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బిస్కెట్ బాక్స్ ను జప్తు చేసి షాప్ యజమానిని స్టేషన్ కు తరలించారు. ఎక్స్పైరీ డేట్ దాటి మూడు నెలలు అవుతున్నా ఆ పతంజలి బిస్కెట్లు అమ్ముతున్న షాప్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. ఈ విషయం పై స్థానికులు కూడా ఓమ్ రెడ్డికి మద్దతు ఇవ్వడంతో అతని పై కేసు మరింత స్ట్రాంగ్ అవుతుంది.. నగరంలో ఈ ఘటన కలకలం రేపుతోంది.. దీంతో హైదరాబాదీలు బిస్కెట్స్ తినడం పై ఆలోచిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,884FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles