Tuesday, August 3, 2021
spot_img

ఇమ్యునిటిని పెంచే ఆ వంట ఇదే..

ప్రస్తుతం కరోనా ప్రభావం పెరుగుతూ వస్తుంది. ఈ మేరకు ఏదైనా హెల్తీ ఆహారాన్ని తీసుకుంటే మంచిది అని అంటున్నారు.. ఎటువంటి ఫుడ్ ను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం..

జొన్న పెసర చెక్కలు..

కావలసిన పదార్థాలు:

జొన్నపిండి: ఒక కప్పు,

పెసరపిండి: ఒక కప్పు,

నువ్వులు: ఒక టేబుల్‌ స్పూన్‌,

నెయ్యి: పావు కప్పు,

ఉప్పు: తగినంత,

వాము: అర టీ స్పూన్‌

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో జొన్నపిండి, పెసరపిండి వేసి నువ్వులు, ఉప్పు, వాము కలపాలి. నెయ్యిని కాస్త గోరువెచ్చగా చేసి, పిండి మిశ్రమంలో వేసి బాగా కలిపి, తగినన్ని నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు, పిండిముద్దను చిన్నచిన్న ముద్దలుగా చేసి చెక్కలు ఒత్తుకుని నూనెలో దోరగా కాల్చుకోవాలి. కరకరలాడే ఈ జొన్న పెసర చెక్కలను
ఒవెన్‌లోనూ బేక్‌ చేసుకోవచ్చు… అంతే ఎంతో రుచికరమైన జొన్న పెసర చెక్కలు రెడీ..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,882FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles