Thursday, July 22, 2021
spot_img

ఈ సలాడ్ తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..

ఇప్పుడు వున్న పరిస్థితుల వల్ల ఆరొగ్యంగా వుండటానికి చాలా మంది భావిస్తున్నారు. అయితే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కూడా ముఖ్యమే. ఇక కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు జీవన శైలిలో కూడా ఎక్కువగానే మార్పులు జరిగాయి. ఇప్పటికే అందరూ ఇంట్లో చేసిన వంటకాలను మాత్రమే తీసుకొవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కువగా ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్లాక్ ఐడ్ బీన్స్ తో తయారు చేసిన ఫుడ్.. దీన్ని లొబియా అని కూడా పిలుస్తారు. అయితే ఈ ఫుడ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. మొదలగు విషయాలను గురించి తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు..

నిమ్మకాయ రసం.
దాల్చిన చెక్క పొడి :1/4 స్పూన్
మిరియాల పొడి: 1/4 స్పూన్
కాల్చిన జీలకర్ర పొడి: 1/4 స్పూన్
చాట్ మసాలా :1/4 స్పూన్
తేనె 1 స్పూన్
నల్ల ఉప్పు తగినంత

తయారి విధానం:

బ్లాక్ ఐడ్ బఠానీలను రాత్రి సమయంలో 4-6 గంటలు నానబెట్టాలి. 2-3 విజిల్స్ వచ్చేవరకు కొంచెం ఉప్పు వేసి ఉడికించాలి. ఆ తర్వాత అందులో ఉన్న నీటిని తీసివేయాలి. 1, 1/2 కప్పుల కంటే ఎక్కువ ఉండకూడదు. ఆ తర్వాత ఒక గిన్నెలో బఠానీలు, తరిగిన టమోటా, దోసకాయ, మామిడి కాయ ముక్కలు, కాటేజ్ చీజ్ జత చేయాలి. ఆ తర్వాత మసాలా వేసి బాగా కలపాలి. ఇక చివరిగా శనగలు, కొత్తిమీర చల్లుకొని నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ సూపర్..

శరీరానికి కావలసిన శక్తి, మినరల్స్ వెంటనే అందుతాయి.. మీరు కూడా ట్రై చేయండి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,864FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles