Sunday, July 18, 2021
spot_img

ఆ విషయంలో నెటిజన్ల సాయం కోరిన ఇంద్రజ..

అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిన ఆమె ఇలా నెటిజన్ల సాయం కోసం అభ్యర్థించడం ఏంటి? ఇలాంటి సందేహాలు అందరినీ ఆశ్చర్యానికి లోను అయ్యేలా చేస్తున్నాయి.. మీరు విన్నది అక్షరాల నిజం.. ఇంద్రజ నెటిజన్ల సాయం కోరింది. సెలబ్రిటీల సమాచారం ఉండే వికీపీడియాలో ఇంద్రజకు సంబంధించిన వివరాలన్నీ తప్పుగా ఉన్నాయట. ఆఖరికి తన పుట్టిన తేదీతో పాటు పెళ్లి తేదీ కూడా రాంగ్‌గా ఉందని, వాటిని చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉందని తెలుపుతూ.. వాటిని ఎలా సరిచేయించుకోవాలో తెలపాల్సిందిగా ఇంద్రజ తన ఇన్‌స్టాగ్రమ్ వేదికగా నెటిజన్లను కోరింది.

దీనిపై నెటిజన్లు ఇచ్చిన సలహాలతో ఆమె శాటిస్‌ఫై అయినట్లుగా తెలుపుతూ.. థ్యాంక్స్ కూడా చెప్పింది.ఇక ఇంద్రజ ప్రస్తుతం రోజా స్థానంలో ‘జబర్థస్త్’ షోకి జడ్జిగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే.అంతేకాదు అటు సినిమాలలో కూడా వచ్చిన అవకాశాలను వదులుకోకుండా నటిస్తూ జనాలను విపరీతంగా ఆకట్టుకుంతుంది.. ఒకప్పుడు ఆమె స్టార్ హీరోల చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గడంతో నటుడు, బిజినెస్ మ్యాన్ అయిన అబ్సర్‌ని 2005లో వివాహం చేసుకుని.. కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. మళ్లీ ఆమె ‘దిక్కులు చూడకు రామయ్యా’ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,863FollowersFollow
18,000SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles