Thursday, July 22, 2021
spot_img

బెల్లం తో ఇలా చేస్తే ఆ సమస్యలు రావు..

తియ్యటి బెల్లం చూడగానే నోట్లో వేసుకోవాలని అనిపిస్తుంది. అందుకే చాలా మంది బెల్లాన్ని తీసుకుంటారు. ఇకపోతే బెల్లం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బాడీలోని వేడిని తగ్గించటానికి బెల్లం చక్కని ఔషదం. అందుకే బెల్లాన్ని పానకము రూపంలో ఎక్కువగా తీసుకుంటారు.

బెల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వేసవిలో బెల్లం పానకం తాగితే శరీరం చల్లబడి వడదెబ్బ, నీరసం వంటివి తగ్గుతాయి. రోజూ పాలల్లో పంచదార బదులు బెల్లం వేసుకుని తాగితే ఎముకలు బలంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులున్న వాళ్లు రోజూ బెల్లంలో అల్లం ముక్కని కలిపి తింటే నొప్పులు మాయమవుతాయి..

బెల్లంలో కొవ్వును కరిగించే గుణం ఉంటుంది.. ముఖ్యంగా మహిళల్లో రుతుక్రమ సమస్యలు తగ్గిపోతాయి. బెల్లంలో ఐరన్‌ శాతం ఎక్కువ. కాబట్టి రక్తహీనతతో బాధపడే మహిళలు తప్పనిసరిగా తీసుకోవాలి. బెల్లంలో ఐరన్‌, పొటాషియం, ఫాస్ఫరస్‌, సోడియం, ఫోలిక్‌ యాసిడ్‌ ఉండటంవల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,864FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles