Wednesday, August 4, 2021
spot_img

ఆనందయ్య మందుపై పాల్ సంచలన నిర్ణయం..

ఇప్పుడు ఎవరి నోట విన్నా ఒకటే మాట.. ఆనందయ్య మందు నిజంగా పనిచెస్తుందా?.. ఈవిషయం పై సినీ రాజకీయ నాయకులు ఆ ఆయుర్వేదం పై మద్దతూ తెలుపుతున్నారు.. మత గురువు కేఏ పాల్ కృష్ణపట్నం ఆనందయ్యకు మద్దతుగా నిలిచారు. ఆనందయ్య గురించి కేఏ పాల్ ఓ వీడియోలో మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రులు ఘోరంగా దోచుకుంటున్నాయన్నారు. తన తల్లి ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందన్నారు. అందరినీ అనలేమని.. కానీ కొంతమంది దోచుకుతింటున్నారన్నారు.

కరోనా ఉధృతికారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ సమయంలో ఆనందయ్యను దేవుడు వరంగా ఇచ్చారన్నారు. ప్రకృతి సహజంగా లభించిన మూలికలతో మందులను తయారు చేస్తున్న ఆనందయ్యను కాపాడుకోవాలన్నారు. ఆయన ఉన్న చోటికి జాతీయ మీడియా వెళ్లి విచారణ జరపాలని కోరారు. సైడ్ ఎఫెక్ట్స్ లేవని సంస్థలే చెబుతున్నాయి. ఆనందయ్యను విడుదల చేయాలని సీఎం జగన్, డీజీపీ, కేంద్ర హోంమంత్రి, హైకోర్టు సీజేఐ, సుప్రీం సీజేఐలను కోరండని విజ్ఞప్తి చేశారు..

సరైన మందు లేని కరోనాపై పోరుకు ఆనందయ్య తమతో చేతులు కలపాలని కోరారు. ఆనందయ్యను కస్టడీ నుంచి విడుదలచేయాలన్నారు. ఆనందయ్యతో కలిసి తమ సంస్థ ఉచితంగా ట్రెయినింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. తమ సంస్థ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయించుకోవాలన్నారు.. ఈ మందు త యారి పై ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్లు చెప్పాడు.. ఇది కాస్త రాజకీయా ల్లో చర్చలకు దారి తీసింది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,883FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles