Sunday, July 18, 2021
spot_img

చిన్నారులకు అలాంటి ఆహారం తప్పనిసరి..

ప్రబలుతున్న రోగాల కారణంగా చాలా మంది వాటి నుంచి బయట పడటానికి ఏవేవో చేస్తారు.. ఇలాంటి వాటి నుంచి బయట పడాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం బలమైన ఆహారాన్ని తినాలి.పైగా, పెద్ద వాళ్ళు పాటించినన్ని జాగ్రత్తలు కూడా చిన్న పిల్లలు పాటించరు. కానీ వారి ఇమ్యూనిటీ పెరగాలంటే వారు సరిగ్గా ఆహారం తీసుకునేలా చేయడం తప్పని సరి. పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ ఫుడ్స్ వారికి తినిపించండి.

కోడిగుడ్డు పచ్చసొనలో ఐరన్‌, విటమిన్‌ ఎ, డి ఉంటాయి. ఎగ్‌వైట్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్లను అడ్డుకునేందుకు తోడ్పడతాయి. పాలకూర, మెంతి, బ్రకోలీ, మునగాకులు…వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఫోలిక్‌ ఆసిడ్‌, ఐరన్‌, ఫైబర్‌, విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా లభిస్తాయి. వారంలో కనీసం మూడురోజులు ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. స్వీట్‌కార్న్‌లో విటమిన్‌ బి12, ప్రొటీన్స్‌, ఫైబర్‌ అధికంగా లభిస్తాయి. సలాడ్‌, సూప్స్‌ రూపంలో ఇతర డిష్‌లతో కలిపి తీసుకున్నా ఇమ్యూనిటీ పెరుగుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,863FollowersFollow
18,000SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles