Thursday, July 22, 2021
spot_img

ఆచార్య క్రేజ్ కోసం కొరటాల భారీ ప్లాన్..

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య.. ఈ సినిమా షూటింగ్ ఇంకా చివరి దశ షెడ్యూల్ ను జరుపుకుంటుంది. అస‌లే బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన కొర‌టాల ఈ సారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అని అంతా ఎదురు చూస్తున్నారు.అయితే ఇప్పుడు క‌రోనా క‌రాణంగా ఆ సినిమా విడుద‌ల తీదీని వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడున్న క‌రోనా ప‌రిస్థితుల కార‌ణంగా ఎప్పుడు వ‌స్తుందో అన్న అనుమానంలో ఉన్నారు అభిమానులు. వారిలో అంచ‌నాలు త‌గ్గిపోయేలా ఉన్నాయి.

దీంతో వారిలో సినిమాపై క్రేజ్ త‌గ్గ‌కుండా చూసేందుకు కొర‌టాల ప్లాన్ వేస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే టీజ‌ర్‌, లాహే లాహే సాంగ్‌తో మంచి పేరు వ‌చ్చింది. ఇప్పుడు రెండో పాట‌ను విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడంట‌. ఇందులో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి స్టెప్పులేసిన ఓ పాట‌ల‌ను విడుద‌ల చేయాల‌ని చిరు, కొర‌టాల భావిస్తున్న‌ట్టు స‌మాచారం… ఈ వార్త కనుక నిజం అయితే మెగా ఫాన్స్ కు పండగే అని చెప్పాలి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,864FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles