Sunday, July 25, 2021
spot_img
Home Blog

తెరాసకు భారీ షాక్.. బీజెపి లోకి ఈటల..

0

రాజకియాలు అంటే పార్టీలు మారడం సహజం.. ఇప్పుడు కూడా అలాంటి ఘటన ఎదురైంది..బీజేపీలో ఈటల రాజేందర్ చేరికకు ముహూర్తం ఖరారయ్యింది. ఈనెల 8వ తేదీన ఈటల కాషాయ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీలోకి చేరడానికి ముందే ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్‌కు ఆయన రాజీనామా చేయనున్నారు. శుక్రవారం (రేపు) చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు రాజీనామాకంటే ముందే ఈటలను సస్పెండ్ చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది.

ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఈటల తన అనుచరులతో సమాలోచనలు జరిపారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జడ్పీ ఛైర్మన్ ఉమ ఉన్నారు. మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నికలో తన సతీమణి జమునను పోటీలో నిలిపే యోచనలో ఈటల ఉన్నట్లు సమాచారం.. ఇక ఎంత మంది ఆయన తో వెళ్తారొ చూడాలి..

ఇమ్యూనిటీ పెంచే టీ..

0

ప్రస్తుతం మనకు ఇమ్యూనిటీ చాలా అవసరం.. అందుకే ఎన్నో రకాల పదార్థలను తీసుకుంటారు.వాము ,తులసి తో తయారు చేసిన టీ తాగితే హెల్త్ కు చాలా మంచిదని అంటున్నారు.ఆ టీ ఎలా తయారు చేస్తారొ చూడాలి..

కావల్సినవి: అర టేబుల్‌ స్పూన్‌ వాము, 5 తులసి ఆకులు, అర టేబుల్‌ స్పూన్‌ నల్ల మిరియాల పొడి, ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె.

తయారీ: స్టవ్‌ మీద గిన్నె పెట్టి, అందులో గ్లాసు నీళ్లు పోసి, వాము, మిరియాల పొడి, తులసి ఆకులు వేయాలి. ఐదు నిమిషాలపాటు మరిగించాలి. స్టవ్‌ ఆఫ్‌ చేసి ఆ మిశ్రమాన్ని కప్పులోకి వడగట్టాలి. కొద్దిగా చల్లారిన తరువా తేనె కలుపుకుని తాగాలి.

ఈ టీ వల్ల కలిగే ప్రయోజనాలు..

వాములో ఔషధ గుణాలు పుష్కలం. దీర్ఘకాల రోగాలు నయం చేయడానికి ఆయుర్వేదంలో దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. సాధారణ జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దీనికి తులసి, మిరియాలు, తేనె జత చేయడంవల్ల మరింత ప్రభావవం చూపిస్తుంది..

ఏజెంట్ పాత్రలో ప్రభాస్..

0

రెబల్ స్టార్ ప్రస్తుతం వరుస సినిమాలలొ నటిస్తూ బిజిగా వున్నారు.బాహుబలి’ చిత్రంతో హీరోగా జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్రభాస్‌. ఈ చిత్ర అద్వితీయ విజయం అనంతరం బాలీవుడ్‌ అగ్రదర్శకులు సైతం ప్రభాస్‌తో సినిమా చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ప్రభాస్‌ హీరోగా సిద్ధార్థ్‌ ఆనంద్‌(‘వార్‌’ ఫేమ్‌) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ ‘రా’ఏజెంట్‌ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. రోమాంచితమైన యాక్షన్‌ సన్నివేశాలతో కూడిన ఈ సినిమా షూటింగ్‌ మొత్తం విదేశాల్లోనే జరుగనున్నట్లు చెబుతున్నారు.ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’, ‘సలార్‌’ సినిమాల్లో నటిస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించారు

ఇలా కూడా కరోనా టెస్ట్ చెయొచ్చునా..

0

కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆర్టీపీసీఆర్‌ పరీక్షల తర్వాత సీటీ స్కానింగ్‌ కీలకంగా మారింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినా కూడా స్కానింగ్‌లో ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ గుర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సీటీ స్కానింగ్‌తో రేడియేషన్‌ భయం, ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ఫలితాలు రోజుల తరబడి ఆలస్యం కావడంతో వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నవారికి కూడా చికిత్స సకాలంలో అందడం లేదు.

గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినట్టు ఆర్ట్‌పార్క్‌ సీఈవో ఉమాకాంత్‌ సోని చెప్పారు. ఇప్పటివరకు 500 మంది డాక్టర్లు సేవలను వినియోగించుకొన్నారని పేర్కొన్నారు. వచ్చే 15 రోజుల్లో 10వేల మంది వైద్యులకు ఈ సాంకేతికత అందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. 6-8 నెలలవరకు తమ సేవలకు ఎలాంటి రుసుము వసూలు చేయబోమని చెప్పారు.

ఈ కరొన ఫలితం తెలుసుకొవాలంటే..

డాక్టర్‌ www. xraysetu.com లోకి వెళ్లాలి.
ఎక్స్‌రేసేతు బీటా బటన్‌పై క్లిక్‌ చేయాలి.
వాట్సాప్‌ చాట్‌బాక్స్‌ ఓపెన్‌ అవుతుంది.
వైద్యుడు +91 80461638638 నంబర్‌కు వాట్సాప్‌ చేయాలి.. ఎక్స్‌రే సేతు సర్వీస్‌ అందుబాటులోకి వస్తుంది.తర్వాత వైద్యుడు రోగి ఎక్స్‌రేను వాట్సాప్‌ చేయాలి.
10-15 నిమిషాల్లో ఫలితం తెలుస్తుంది.

మంత్రి అనిల్ కు బిగ్ షాక్..

0

పోలవరం పర్యటనలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు చేదు అనుభవం ఎదురైంది. తమకు ఇంతవరకు అర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందలేదని పేర్కొంటూ కొందరు నిర్వాసితులు మంత్రిని నిలదీశారు. పాతపైడిపాక గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందలేదని పేర్కొంటూ గ్రామంలోనే ఉంటున్నాయి. అయితే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయాలని అధికారులు పలుమార్లు హెచ్చరించారు.

‌ ఈ నేపథ్యంలో పోలవరం పర్యటనకు వచ్చిన మంత్రిని అక్కడి ప్రజలు అడ్డుకున్నారు.. అర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదని వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దాంతో వారి సమస్యను వెంటనే పరిష్కరిస్తానని అనిల్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. ఇది కాస్త రాజకీయ చర్చ్ లకు దారి తీసింది..

సోను సూద్ ను కలవడానికి యువకుడి పాదయాత్ర..

0

సోను సూద్ పేరు ఇప్పుడు ఎక్కడ చూసిన మారు మోగిపోతుంది. ఆయన పేదలకు చేస్తున్న సేవలు అలా ఉన్నాయి.. రీల్ హీరో కాస్త పేదల పాలిట దేవుడయ్యాడు. కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు సోనూ సూద్ దాతృత్వ సేవలు వెంకటేశ్ ను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా, తన తల్లిదండ్రులే తనకు స్ఫూర్తి అని ఓ సందర్భంలో సోనూ సూద్ చెప్పిన మాటలు వెంకటేశ్ లో బలంగా నాటుకుపోయాయి. ఈ నేపథ్యంలో, ఎలాగైనా సోనూ సూద్ ను కలవాలని నిశ్చయించుకున్న వెంకటేశ్ హైదరాబాద్ నుంచి ముంబయికి పాదయాత్రగా బయల్దేరాడు.

దోర్నాలపల్లికి చెందిన వెంకటేశ్ ఇంటర్ చదువుతున్నాడు. కాలేజీ జరగకపోవడంతో ఓ హోటల్ లో పనిచేస్తున్నాడు. తండ్రి ఆటో డ్రైవర్ కాగా, ఇటీవల వాయిదాలు చెల్లించకపోవడంతో వారి ఆటోను ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు స్వాధీనం చేసుకున్నారు.మధ్యలో గుడి కనిపిస్తే సోనూ సూద్ పేరిట పూజలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ముంబయి వెళ్లిన తర్వాత సోనూ సూద్ ను కలిసి, తన కుటుంబ పరిస్థితిని వివరించాలని వెంకటేశ్ భావిస్తున్నాడు.అతని ఆశ ఏమాత్రం ఫలిస్తుందో చూడాలి..

అమ్మడు ఆలోచన వర్కౌట్ అవుతుందా ?

0

ఈ మధ్య తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోయిన్లు సినిమాలలో నటించడం మానేసి సినిమాలను చిత్రీకరించడం లో బిజీగా ఉన్నారు. గతంలో చాలా మంది అదే పనిలో ఉన్నారు. కానీ అనుపమ పరమేశ్వరన్ పేరు మాత్రం తెరపై ఎక్కువగా వినిపించింది. ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ దర్శకత్వం చేయాలకుంటుంది. నాని ‘జెంటిల్ మేన్’ సినిమా ద్వారా పరిచయమైన నివేద థామస్, తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టేసింది. ఆ తరువాత చేసిన ‘నిన్నుకోరి’ .. ‘జై లవ కుశ’ సినిమాలు కూడా ఆమెకు భారీ విజయాలను అందించాయి. ‘118’ .. ‘ బ్రోచేవారెవరురా’ సినిమాలు కూడా ఆమె కెరియర్ కి ఎంతో హెల్ప్ అయ్యాయి.

అలాంటి నివేద థామస్ దృష్టి డైరెక్షన్ పై ఉందట. మొదటి నుంచి కూడా తనకి డైరెక్షన్ అంటే ఇష్టమనీ, అందువలన డైరెక్షన్ కి సంబంధించిన కోర్స్ ను కూడా పూర్తిచేశానని చెప్పింది. హీరోయిన్ గా కొంతకాలం చేసిన తరువాత, తాను మెగా ఫోన్ పడతానని అంది. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ చేస్తాననీ, ఆ తరువాతనే సినిమా వైపు వస్తానని చెప్పింది. దర్శకురాలిగా కూడా రాణించగలననే బలమైన నమ్మకమే ఉందని అంది.ఇలా అన్న అమ్మడు పాపులర్ అవుతుందేమో చూడాలి…

నిఖిల్ కు షాక్ ఇచ్చిన పోలీసులు..

0

కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారి పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పాటించకుంటే ఎవరికైనా చలానాలు వేస్తున్నారు.. తాజాగా హీరో నిఖిల్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ సినీ నటుడు నిఖిల్ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. కారు నంబరు ప్లేటు నిబంధనల ప్రకారం లేదని మరో చలానాను పంపారు. అయితే, నిబంధనల ఉల్లంఘన సమయంలో నటుడు నిఖిల్ కారులో లేరని పోలీసులు ధ్రువీకరించారు.

కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం లాక్‌డౌన్ అమల్లో ఉంది. కరోనా వైరస్ కేసులకు కట్టడి వేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఇప్పటి వరకు రెండుసార్లు పొడిగించింది. తాజాగా విధించిన లాక్‌డౌన్ నిబంధనలు ఈ నెల 9 వరకు అమల్లో ఉంటాయి. ప్రాణాలను కాపాడుకోవాలంటే రూల్స్ పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

వాము లో ఔషదాలు మాములుగా లేవుగా..

0

వంటింట్లో దొరికే ప్రతి వస్తువు కూడా జనాల రోగాలకు చెక్ పెడుతూంది.. ముఖ్యంగా వాము తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంటే సకల రోగాలకు దివ్య ఔషదాలు.. అని నిపుణులు అంటున్నారు. అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే దీనిని పలు ఔషధాల తయారీలో వాడుతారు. వాము తరచుగా తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. జలుబు, దగ్గు తగ్గి బొంగురు పోయిన గొంతు మళ్ళీ నార్మల్ అవుతుంది.

వామును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిలో కొద్దిగా తేనే వేసుకుని తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళూ కరుగుతాయి. శ్వాసకోసం సమస్యలతో ఇబ్బంది పడే వారు వామును టీ చేసుకుని తాగడం మంచిది. అంతేకాదు వాము టీ తాగడం వల్ల క్యాన్సర్ కూడా రాదు.

గర్భిణీ మహిళలకు వాము చాలా మంచిది. దీనిని తినడం వల్ల మలబద్దకం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. డెలివెరీ తర్వాత కూడా వాము తినడం వల్ల గర్భసయం శుభ్రపడడంతో పాటు పాలు కూడా పడతాయని పెద్దలు ఎప్పటి నుండో చెబుతున్నారు. కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా వాము కీలక పాత్ర పోషిస్తుంది. వాము నూనెను కీళ్లకు మర్దనా చేయడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. కొవ్వు ను కూడా ఇట్టే కరిగిస్తుంది..

పిల్లలు చురుగ్గా ఉండాలంటే ఇవి కంపల్సరీ..

0

పిల్లలకు మంచి పొషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యమైంది.. అలా లేకుండా ఏది పడితే అది పెడితే పోషకాహార లోపం వల్ల ఎదుగుదల ఆగిపోతుంది.. ఈ ఫుడ్ ను నిత్యం పెడితే.. మంచి ఆరోగ్యం వుంటుందని నిపుణులు అంటున్నారు..

చేపలు :

ఆయిలీ ఫిష్‌లలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు అభివృద్ధికి, ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. సాల్మన్, మాకేరెల్, ఫ్రెష్ ట్యూనా, ట్రౌట్, సార్డినెస్, హెర్రింగ్ వంటి చేపల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. కావునా వారానికి ఒకసారి వీటిని ఆహారంగా తీసుకోవాలి.

వోట్స్ / వోట్‌మీల్ :

వోట్‌మీల్‌, వోట్స్ మెదడుకు అద్భుతమైన శక్తి వనరులను అందిస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిలో విటమిన్లు ఇ, బి కాంప్లెక్స్, జింక్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల మెదళ్ళు చురుకుగా పనిచేయడానికి సహాయపడతాయి. ఆపిల్, అరటి, బ్లూబెర్రీస్ లేదా బాదం వంటి ఏదైనా టాపింగ్‌తో వినియోగించవచ్చు.

రంగురంగుల కూరగాయలు :

రంగు రంగుల కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. టమాటా, చిలగడదుంపలు, గుమ్మడికాయ, క్యారెట్లు, బచ్చలికూర ఇటువంటి కూరగాయలు పిల్లల ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

ఇవే కాకుండా పాలు సంబంధిత పదార్థాలను తీసుకోవడం మంచిది..ముఖ్యంగా గుడ్లను తీసుకోవడం చాలా మంచిది..

Stay connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe

Latest article

తెరాసకు భారీ షాక్.. బీజెపి లోకి ఈటల..

0
రాజకియాలు అంటే పార్టీలు మారడం సహజం.. ఇప్పుడు కూడా అలాంటి ఘటన ఎదురైంది..బీజేపీలో ఈటల రాజేందర్ చేరికకు ముహూర్తం ఖరారయ్యింది. ఈనెల 8వ తేదీన ఈటల కాషాయ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది....

ఇమ్యూనిటీ పెంచే టీ..

0
ప్రస్తుతం మనకు ఇమ్యూనిటీ చాలా అవసరం.. అందుకే ఎన్నో రకాల పదార్థలను తీసుకుంటారు.వాము ,తులసి తో తయారు చేసిన టీ తాగితే హెల్త్ కు చాలా మంచిదని అంటున్నారు.ఆ టీ ఎలా తయారు...

ఏజెంట్ పాత్రలో ప్రభాస్..

0
రెబల్ స్టార్ ప్రస్తుతం వరుస సినిమాలలొ నటిస్తూ బిజిగా వున్నారు.బాహుబలి' చిత్రంతో హీరోగా జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్రభాస్‌. ఈ చిత్ర అద్వితీయ విజయం అనంతరం బాలీవుడ్‌ అగ్రదర్శకులు సైతం...