Saturday, July 17, 2021
spot_img

ఆ రాష్ట్రంలో మరో రెండు వారాల పాటు లాక్ డౌన్..

దేశంలో కరోనా ప్రభావం గంట గంటకు పెరుగుతూ వస్తుంది..లక్షల మంది ప్రాణాలను కరోనా బలితీసుకుంది.ఈ మేరకు పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను విధించారు.మహారాష్ట్ర తర్వాత అంతటి రేంజులో కరోనా కేసులు ఉన్న రాష్ట్రం కర్ణాటక..సెకండ్ వేవ్ సమయంలోనూ కర్ణాటకలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 32 వేలకు పైగా కొత్త కేసులు వెల్లడి కాగా, 353 మంది చనిపోయారు.

ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించాలని సీఎం యెడియూరప్ప నిర్ణయించారు.జూన్ 7 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. నిత్యావసర వస్తువులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో కొనుగోలు చేయాలని సీఎం సూచించారు. లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించవద్దని పోలీసులకు అధికారులకు స్పష్టం చేశామని, ఆ మేరకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు. కర్ణాటకలో మే 10 నుంచి 24వ తేదీ వరకు తొలుత లాక్ డౌన్ ప్రకటించినా కేసులు పెరగడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,863FollowersFollow
18,000SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles