Sunday, July 25, 2021
spot_img

బేరి పండు తో బోలెడు లాభాలు..

బేరి పండు.. ఈ పేరు అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ఫియర్స్ ఫ్రూట్ అంటే చాలా మందికి తెలుసు.. ఇది సీజనల్ పండు.. వీటిని తీసుకోవడం వాళ్ళ మన శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఇక అస్సలు వదలరు. వేసవిలో మామిడి పండ్లు ఫేమస్. దానితో పాటు చాలా రకాల పండ్లు మార్కెట్లో కనబడుతుంటాయి. అలా కనబడే వాటిలో పియర్స్ కూడా ఒకటి. ఆరోగ్యానికి పియర్స్ చేసే మేలు అంతా ఇంతా కాదు.

కాల్షియం, ఐరన్,మ్ ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం వంటి వాటితో పాటు విటమిన్లు సి, ఈ, కే ఉంటాయి. దీన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మహిళల్లో ముఖ్యంగా మెనోపాజ్ దశ దాటినవారికి గర్భ కోశ సమస్యలూ తగ్గిపోతాయి. గుండెజబ్బులు రాకుండా సాయపడుతుంది. కంటిచూపు మెరుగుపడడానికి బాగా పనిచేస్తుంది. అంతే కాదు ఎలర్జీలను దూరం చేసే పోషకాలు ఇందులో ఉన్నాయి. ఇంకా బరువు తగ్గాలనుకునేవారికి ఇదొక మంచి ఔషధంగా పనిచేస్తుంది.

వీటిలో కార్బోహైడ్రేడ్లు తక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. కెరాటిన్, విటమిన్ల కారణంగా ఎక్కువ వయసు ఉన్నవారు తీసుకుంటే యవ్వనంగా కనిపిస్తారు. ఇంకా ఇది యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. శరీరంలోని విష పదార్థాలని బయటకు పంపించడంలో ఈ పండ్లు భేష్ అనే చెప్పాలి. చూసారుగా ఈ పండ్లు తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో .. ఇప్పటి నుంచి వీటిని తీసుకోవడం అలవాటు చేసుకోండి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles