Sunday, July 25, 2021
spot_img

కార్తీక దీపం సీరియల్ పై మంచు లక్ష్మీ కామెంట్స్..

స్టార్ మా లో ప్రసారమవుతున్న సక్సెస్ ఫుల్ సీరియల్ కార్తీక దీపం.. ఇప్పుడు ఈ సీరియల్ ఆసక్తి కలిగిస్తుంది.. దీప గురించి అసలు నిజం తెలియడంతో కార్తిక్ కుమిలి కుమిలి ఏడుస్తాడు. ఆ సన్నివేశం ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తుంది.తెలుగు వారిని విశేషంగా ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్‌లో కార్తీక్ అనే పాత్ర ఉంటుంది.ఇకపోతే వంట‌ల‌క్క పాత్ర గురించి ప్ర‌త్యేకంగా చెప్పే అవ‌స‌రం లేదు. ఈ సీరియల్ క‌థ ఏంటంటే దీప అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని అనుమానంతో వదిలేస్తాడు డాక్టర్ బాబు.

ఆమెకు పుట్టిన కవలలు చివ‌ర‌కు తల్లిదండ్రులను ఎలా కలిపారనే నేపథ్యంతో ఈ సీరియ‌ల్ తీస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో డాక్ట‌ర్ బాబుకు అస‌లు నిజం తెలుస్తుంది. దీంతో ఎన్న‌డూ లేని విధంగా క‌న్నీరు పెట్టుకుంటాడు.ఈ విషయం పై సినీ నటి మంచులక్ష్మీ ఆసక్తికర ట్వీట్ చేస్తుంది. ఆ సీరియల్ లో మొద‌టిసారి డాక్ట‌ర్ బాబు కార్తీక్ ఏడ్చాడు అట.. ఎట్ట‌కేల‌కు మా అమ్మ హ్యాపీగా ఫీలైంది’ అంటూ సినీ న‌టి మంచు ల‌క్ష్మి చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

కొన్ని రోజులుగా భావోద్వేగాల‌ను పండిస్తూ మ‌హిళ‌ల‌తో క‌న్నీరు పెట్టిస్తూ ఈ సీరియ‌ల్ కొన‌సాగుతోంది. మొద‌టి సారి డాక్ట‌ర్ బాబు క‌న్నీరు పెట్టుకోవ‌డంతో సామాజిక మాధ్య‌మాల్లో ఇందుకు సంబంధించిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.చివ‌ర‌కు మంచు ల‌క్ష్మి కూడా దీనిపై ట్వీట్ చేసిందంటే ఈ సీరియ‌ల్‌కు సెల‌బ్రిటీల ఇంట్లో కూడా ఉన్న క్రేజ్ ఏంటో అర్థ‌మవుతోంది. కాగా, మరికొంద‌రు నెటిజ‌న్లు డాక్ట‌ర్ బాబు క‌న్నీరు పెట్టుకోవ‌డంపై సెటైర్లు వేస్తున్నారు… ఎందరో హృదయాలను కదిలించిన ఈ సీరియల్ ఈరోజు ఎలా ఉండబోతుందో చూడాలి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles