Tuesday, August 3, 2021
spot_img

మామిడి తో రుచికరమైన పూరి..

మామిడిపండు తో పూరి చేసుకుంటే చాలా బాగుంటుందని అంటున్నారు.. ఆ పూరికి కావలసిన పదార్థాలు తయారీ విధానం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:
గోధుమ పిండి: 2 కప్పులు, మామిడిపండు గుజ్జు: అర కప్పు, ఉప్పు: చిటికెడు, యాలకుల పొడి: చిటికెడు, చక్కెర: 3 టేబుల్‌ స్పూన్లు, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం:
ముందుగా మామిడిపండ్ల ముక్కలు, యాలకుల పొడి, చక్కెర కలిపి మిక్సీలో గుజ్జులా చేసుకోవాలి. ఒక గిన్నెలో మామిడి గుజ్జు, జల్లించిన గోధుమపిండి వేసి పూరీపిండిలా కలుపుకోవాలి. అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. తడిపిన పిండి తడిబట్టతో కప్పి పెట్టి, అరగంటసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిని బాగా కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకొని పూరీలుగా వత్తుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి, ఈ పూరీలను రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.అంతే వేడి వేడి మ్యాంగొ పూరి రెడీ..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,882FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles