Sunday, July 25, 2021
spot_img

సూపర్ స్టార్ కృష్ణ పై ఎంపీ సంతోష్ ప్రశంసలు..

సూపర్ స్టార్ కృష్ణ నేడు 79వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తన సామాజిక స్పృహను చాటుతూ ఓ మొక్కను నాటారు. దీనిపై టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ స్పందించారు. కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు నాడు సూపర్ స్టార్ కృష్ణ ఓ మొక్కను నాటడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు..మీరు మొక్కను నాటడం వల్ల ఈ సామాజిక అంశాన్ని మీ అభిమాన లోకం, ఇతరులు కూడా అనుసరిస్తారని భావిస్తున్నాను అంటూ ఎంపీ సంతోష్ ట్వీట్ చేశారు. కృష్ణ మొక్క నాటిన వీడియోను కూడా ఆయన పంచుకున్నారు.ఇక ఎంపీ సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఓ ఉద్యమం స్థాయిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles