Sunday, July 18, 2021
spot_img

మరోసారి జోడీ కట్టనున్న చై, సామ్..

నాగచైతన్య ,సమంత జోడీకి ఉన్నక్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రీల్ లైఫ్ ,రియల్ లైఫ్ లో వీరి జంట కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ..వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశారు. వీరిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ రొమాన్స్ సూపర్ అని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించారు. నిజ జీవితంలో కూడా బ్యూటిఫుల్ జోడీగా వివాహ జీవితాన్ని సాగిస్తున్నారు.

అయితే ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలుస్తున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే వీరిద్దరూ లాస్ట్‌గా మజిలీ చేశారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. దీని తర్వాత ఇప్పుడు ఇంకో సినిమాలో చేస్తున్నారు. కల్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

సీక్వెల్‌గా ఇప్పుడు బంగార్రాజు సినిమా చేస్తున్నాడు నాగార్జున.ఇందులో చైతన్యకు జోడీగా సమంత నటిస్తోందని తెలుస్తోంది. ఇందులో వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని సమాచారం. మరి ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తారా లేక ఇంకాస్త క్రేజ్ ను అందుకుంటారో చూడాలి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,864FollowersFollow
18,000SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles