Sunday, July 25, 2021
spot_img

వీటిని తింటే లక్షలు ఖర్చుపెట్టినా తగ్గని రోగాలు ఇట్లే తగ్గుతాయట…

విరిగి కాయలు చెట్టు, నక్కెర, బంక నక్కెర, బంక కాయలు చెట్టు, బంకిర్ కాయల చెట్టు ఇలా రకరకాలుగా, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి,పిలుస్తూ ఉంటారు. ఏ ప్రాంతంలో ఎలా పిలిచినప్పటికీ, వీటి ప్రయోజనం మాత్రం సమానంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నక్కెర చెట్టు అనేది బోరాగినిస్ అనే కుటుంబానికి చెందింది. దీనిని ఇంగ్లీషులో లాసోరా గంబేరి, ఇండియన్ చెర్రీ అనే పేర్లతో పిలుస్తుంటారు. చుట్టూ దాదాపు మూడు నుండి నాలుగు మీటర్ల ఎత్తు వరకు పెరిగి, వీటి కొమ్మలు అన్ని దిశలలో వ్యాపించి, కొంచెం వంగిపోయి, విశాలంగా పెరుగుతూ కనిపిస్తుంది.

ఈ చెట్టు ని మన సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు. ఈ చెట్టు యొక్క ఆకులు, పండ్లు,పై బెరడు,విత్తనాలు ఇలా అన్నింటిలో యాంటీ బయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఫైబర్,ఐరన్, ఫాస్పరస్ ఇలా ఎన్నో గుణాలు ఇందులో ఉన్నాయి. ఈ పండ్లు ఎర్రగా మాగిన తరువాత తినడం వల్ల నోటి పూత సమస్య నుంచి బయట పడవచ్చు. అంతే కాకుండా శరీరానికి చలువను కూడా చేస్తుంది.

ఈ పండ్లను తినడం మూలంగా మన రక్తంలోని దోషాలు కూడా తొలగిపోతాయి. ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ద్వారా నక్కెర పండ్లకు డయాబెటిస్ ను కంట్రోల్ చేయగల శక్తి ఉంది. వీటిని తినడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయి కంట్రోల్లో ఉంటుంది . మలబద్దకం, అజీర్తి,గ్యాస్ సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఈ పండ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సుఖ విరేచనం కూడా అవుతుంది.

ఈ చెట్టు యొక్క ఆకులను, ఆయుర్వేద వైద్యంలో మందులుగా ఉపయోగించేవారు. చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఈ చెట్టు యొక్క బెరడు ఎండబెట్టి పొడి చేసి నీళ్లలో తడిపి చర్మంపై అప్లై చేస్తూ ఉంటే సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాకుండా దురద ఎక్కువ అయినప్పుడు ఈ చెట్టు యొక్క విత్తనాలను మెత్తటి పేస్ట్ లా చేసుకొని, దురద ఉన్న ప్రాంతాల్లో అప్లై చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది… వీటిని ఇప్పటి నుంచైనా తినడం అలవాటు చేసుకోండి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles