Sunday, July 25, 2021
spot_img

కరోనా టైం లో బైక్ పై కొత్త జంట.. పోలీసులు షాక్..

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు ఓ రేంజులో నమోదు అవుతున్నాయి. ఈ మేరకు లాక్ డౌన్ ను కూడా విధించారు.వేడుకలు , అత్యవసర విందులకూ కేవలం పరిమిత మందితో మాత్రమే జరుపుకోవాలని సూచించారు.అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఓ నవ జంట షాక్ ఇచ్చారు.అందుకు సంబంధిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో… కొత్తగా పెళ్లయిన ఒక జంట బైక్‌పై వెళుతూ కనిపిస్తోంది.

కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ వరుడు… వధువును బైక్ పై తీసుకువెళ్లడాన్ని గమనించిన పోలీసు అధికారి ఆ నూతన దంపతులను అభినందించడమే కాకుండా కానుకలు కూడా ఇచ్చారు.కాగా ఈ వీడియోలో నూతన వధూవరులు తమ పెళ్లి అనంతరం బైక్‌పై ఇంటికి వెళుతున్నట్లు కనిపిస్తుంది. వారిని చూసిన పోలీసు అధికారులు నూతన వధూవరులిద్దరికీ దండలు వేసి అభినందించారు. అలాగే వారికి కానుక రూపంలో కొంత డబ్బు కూడా ఇచ్చారు. ఈ వీడియోను మే 11 న ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా షేర్ చేసినప్పటికీ, ఈ ఘటన జరిగి ఏడాది పైగా అయింది. అయినా కూడా ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles