Saturday, July 17, 2021
spot_img

తెలంగాణాలో మరో పది రోజులు లాక్ డౌన్..

తెలంగాణాలో కరోనా తీవ్రత పెరుగుతూన్న నేపథ్యంలో రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 30వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో, దీనిపై తదుపరి కార్యాచరణకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో మంత్రిమండలి సమావేశం కానుంది. లాక్‌డౌన్‌ పొడిగింపు సహా.. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. ఈ నెల 12 నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే.

బ్లాక్‌ఫంగస్‌ బాధితులు పెరుగుతున్నందున లాక్‌డౌన్‌ను కొనసాగించడమే మేలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీన్నిబట్టి వారం నుంచి పది రోజులపాటు లాక్‌డౌన్‌ను పొడిగించేలా నిర్ణయం వెలువడవచ్చని ప్రభుత్వ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఉన్న మినహాయింపుల సమయాన్ని గంట నుంచి రెండు గంటలు పొడిగించాలనే ప్రతిపాదనపైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,863FollowersFollow
18,000SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles