Friday, October 22, 2021
spot_img

ఒక్క చేప తో లక్షాధికారి అయిన మత్స్యకారుడు..

అదృష్టం ఎప్పుడూ ఎలా తలుపు కొడుతూంది అనేది ఎవ్వరూ ఊహించలెరు..పేదవాడు సైతం రాత్రికి రాత్రే సంపన్నుడు అయిపోతాడు. లక్షాధికారి కావొచ్చు, కోటీశ్వరుడు అవ్వొచ్చు. పాకిస్తాన్ కు చెందిన ఓ మత్స్యకారుడి విషయంలో ఇదే జరిగింది. ఓ చేప అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. ఏకంగా లక్షాధికారిని చేసింది.

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని గ్వాదర్‌ తీరానికి చెందిన సాజిద్‌ హాజీ అబాబాకర్‌ మత్స్యకారుడు. సముద్రానికి వెళ్లడం చేపలు పట్టడం, అవి అమ్మడం. అదే అతడి జీవనాధారం. చేపలు పట్టి అమ్మితేనే అతడి కుటుంబం కడుపు నిండుతుంది. అలాంటిది అబాబాకర్ జీవితం టర్న్ తీసుకుంది. 72 లక్షలు విలువైన అట్లాంటిక్‌ క్రోకర్‌ జాతి చేప..

యూరప్‌, చైనాల్లో ఈ క్రోకర్‌ జాతి చేపలకు ఫుల్ డిమాండ్‌ ఉంది. చాలా చేపల విలువ వాటి మాంసం ఆధారంగా నిర్ణయమవుతుంది. క్రోకర్‌ జాతి చేప విషయం వేరు. వైద్యపరంగా ఈ చేపలకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంది. దీని చర్మాన్ని, ఎముకలను ఔషధాల్లో, ఇతర వైద్యపరమైన అంశాల్లో వాడతారు. అందుకే దీనికి అంత ధర.

నిజానికి వేలంలో ధర ఇంకా ఎక్కువే పలికింది. రూ 86.4 లక్షల వరకు వెళ్లింది. అయితే అంత ధరకు చేజిక్కించుకున్నవారికి రాయితీ ఇవ్వడం స్థానికంగా సంప్రదాయం. అందుకే అధికారులు చివరికి రూ.72 లక్షలుగా ధరను ఖరారు చేశారు.. అలా అతని ఇంట కాసుల వర్షం కురిపించింది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,987FollowersFollow
18,700SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles