Sunday, July 25, 2021
spot_img

పాలక్ రైతా ను ఎలా చేసుకోవాలంటే?

పాలకూర రైతా పేరు వినగానే నోరు ఊరుతుంది… వీటిలో ఎన్నో రకాల పోషకాలు దాగివున్నాయి.. మినరల్స్, విటమిన్స్ ఉన్నాయి. అందుకే ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.. ఇక ఆలస్యం ఎందుకు ఒకసారి ఎలా చేయాలో చూసేద్దామా..

కావలసిన పదార్థాలు:

పాలకూర కట్టలు- నాలుగు, పుల్ల పెరుగు- ఓ కప్పు, పచ్చి కొబ్బరి- అర కప్పు, పచ్చి మిర్చి- రెండు, మిరియాలు- నాలుగు, ఉప్పు- తగినంత పోపు గింజలు- ఓ స్పూను, కరివేపాకు- ఓ రెబ్బ, నెయ్యి- ఓ స్పూను.

తయారు చేసే విధానం:

పాలకూరను బాగా కడిగి ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. ఓ పాన్‌లో నెయ్యివేసి మిరియాలు, జీలకర్ర, పచ్చి మర్చిని వేయించాలి. ఆ తరవాత పాలకూరను కూడా వేసి రెండు నిమిషాలు వేగాక దించి చల్లారనివ్వాలి. కొబ్బరి తురుము, ఉప్పు, కరివేపాకు, పాలకూర మిశ్రమం వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని ఓ గిన్నెలోకి వేసి, పెరుగు కలిపి పోపు పెడితే సరి…అదిరిపోయే రుచితో పాలక్ రైతా రెడీ..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles