Sunday, July 25, 2021
spot_img

‘హరిహర వీరమల్లు’ టీజర్ వచ్చేది అప్పుడే .. !

వకీల్ సాబ్ భారీ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి ‘హరి హర వీరమల్లు’ అనే పవర్ఫుల్ టైటిల్ ను సెట్ చేశారు. మొగల్ పాలనా కాలం నాటి కథాకథనాలతో నిర్మితమవుతున్న ఈ సినిమాలో వజ్రాల దొంగ పాత్రలో పవన్ నటిస్తున్నాడు. ఆయన సరసన నాయికగా నిధి అగర్వాల్ కనిపించనుంది.

ఈ చిత్రం కోసం ఆ కాలంనాటి నిర్మాణ రీతులను పోలిన భారీ సెట్లు వేస్తున్నారు. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారట. కరోనా పరిస్థితులు చక్కబడగానే తిరిగి షూటింగు మొదలవుతుందని అంటున్నారు.ఇక ఈ సినిమా నుంచి త్వరలో టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. అయితే పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, సెప్టెంబర్ 2వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయాలనే ఉద్దేశంతోనే దర్శక నిర్మాతలు ఉన్నారట. అందువలన ఈ మధ్యలో టీజర్ వచ్చే అవకాశం లేదనే అంటున్నారు. అప్పటివరకూ వివిధ రకాల పోస్టర్స్ తోనే అభిమానులను సంతృప్తి పరుస్తూ వెళతారని చెప్పుకుంటున్నారు. చారిత్రాత్మక కథతో వస్తున్నా ఈ సినిమా పై భారీ అంచానాలు ఏర్పడ్డాయి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,870FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles