Monday, August 2, 2021
spot_img

ఈ దొంగ తెలివికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

మాములుగా దొంగలు దొచుకున్న వస్తువులను ఎక్కడైనా అమ్ముకొని సొమ్ము చేసుకోవడం లేదా దాచు కోవడం చేస్తారు. కానీ ఇప్పుడు ఓ దొంగ మాత్రం అందరినీ షాక్ అయ్యేలా చేశాడు.కర్ణాటకలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి 35 గ్రాముల బంగారాన్ని మించేశాడు. పోలీసులకు ఆధారాలు దొరకరాదని దొంగిలించిన బంగారు ఉంగరాలను మింగిన దొంగకు డాక్టర్లు ఆపరేషన్‌ చేసి 35 గ్రాముల బంగారు ఉంగరాలు బయటికితీశారు.

ఈ సంఘటన కర్ణాటక లో దక్షిణకన్నడ జిల్లా సుళ్య పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. మార్చి చివర్లో సుళ్య పాతబస్టాండు వద్ద గల నగల షాపులో చోరీ జరిగింది. రూ.7.50 లక్షల విలువ చేసే 180 గ్రాముల బంగారం ఉంగరాలు, రూ.50 వేలు నగదు దోచుకెళ్లారు. కడుపునొప్పి రావడంతో పోలీసులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఎక్స్‌రే తీయగా కడుపులో ఉంగరాలు ఉన్నట్లు తేలింది. దీంతో వైద్యులు అతని పొట్ట కోసి 25 చిన్న చిన్న ఉంగరాలను తీశారు.. వాటిని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.. ఈ వార్త వైరల్ కావడం తో అందరూ ఆష్చర్య పోతున్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,879FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles